అన్నపూర్ణలోనే అఖిల్‌!

akhil
అఖిల్ సినిమా గురించి రోజుకో కొత్తన్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. క‌థ రెడీ అయిపోయింద‌ని, ద‌ర్శకుడు ఫిక్స్ అయ్యాడ‌ని, నిర్మాత‌గా అశ్వనీద‌త్ వ్యవ‌హ‌రిస్తార‌ని… ఇలా ర‌క‌ర‌కాలుగా చెప్పుకొంటున్నారు. వీటిపై నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ సినిమా ద‌ర్శకుడు ఇంకా ఫైన‌లైజ్ కాలేద‌ట‌. రెండు మూడు క‌థ‌లు రెడీ అవుతున్నాయ‌ని, అందులో ఒక‌టి త్వర‌లోనే ఫిక్స్ చేస్తామ‌ని నాగ్ చెబుతున్నాడు. అయితే ఈ సినిమా మాత్రం త‌మ సొంత బ్యాన‌ర్‌లోనే తీస్తార‌ట‌. ”అఖిల్ సినిమాకి నేనే ప్రొడ్యూస‌ర్‌ని. ఈ విష‌యంలో డౌట్ అక్కర్లెదు” అంటున్నారు నాగ్‌. మొత్తానికి ఈ విష‌యంలో మాత్రం క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే.