రివ్యూ : బాద్‌షా

NTR Baadshah Telugu Movie Review, Rating | Jr NTR | Badshah
తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.5/5 | Click for English Review | Tweet Review

Baadshah Telugu Movie Review | Baadshah Rating | Baadshah Movie Review | Baadshah Review | NTR Baadshah Review | Jr NTR Baadshah Review | Kajal Agarwal | Badshah Review | Badshah Movie Review | Badshah Telugu Movie Review | Badshah Rating | Badshah Movie Rating | Jr NTR Badshah Review | Jr NTR Badshah Movie Review | Cast and Crew | Kajal agarwal in Badshah
Baadshah Telugu Movie Review, Baadshah Rating, Baadshah Movie Review, Baadshah Review, NTR Baadshah Review, Jr NTR Baadshah Review, Kajal Agarwal, Badshah Review, Badshah Movie Review, Badshah Telugu Movie Review, Badshah Rating, Badshah Movie Rating, Jr NTR Badshah Review, Jr NTR Badshah Movie Review, Cast and Crew, Kajal agarwal in Badshah

రివ్యూ: 

శ్రీను వైట్ల మార్క్ సినిమా

మాస్ క‌థ‌ను త‌క్కువగా అంచ‌నా వేయ‌కూడ‌దు. ఒకే క‌థ‌ని ఎన్ని సార్లు వాడుకొన్నా స‌రే, ఒకే పాత్రని ఎంత‌మంది ఎన్నిసార్లు పోషించినా స‌రే…ద‌ర్శకుడికి టాలెంట్ ఉంటే… స‌న్నివేశాలు కొత్తగా రాసుకొంటే.. మ‌రోసారి చూసేలా తీర్చిద్దగ‌ల‌డు. అలాంటి ద‌ర్శకుడు… శ్రీ‌నువైట్ల‌. మాస్ ఇమేజ్ ఉన్న హీరోనీ త‌క్కువగా చూడొద్దు. స‌రైన పాత్ర దొరికితే… రెచ్చిపోతాడు. ఒక్క సినిమా చాలు.. ప‌ది ఫ్లాపుల‌ను మ‌ర్చిపోయేలా చేయ‌గ‌ల‌డు. అలాంటి హీరో ఎన్టీఆర్‌. వేట మానేసినంత మాత్రాన పులి ఎండుగ‌డ్డి తిన‌దు.. పులి పులే! బాక్సాఫీసు ద‌గ్గర త‌ఢాకా చూపించవల‌సిన స‌మ‌యంలో స్టార్ హీరోలు రెచ్చిపోవ‌డం ప‌రిపాటే! ఎన్టీఆర్‌ కి ఆ స‌మ‌యం వ‌చ్చింది. అందుకు త‌గిన ద‌ర్శకుడిని ఎంచుకొన్నాడు. ఆ సినిమానే ‘బాద్‌ షా’. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య‌, మ‌రెన్నో ఆశ‌ల మ‌ధ్య‌…. ‘బాద్‌ షా’ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ పులి వేట ఎలా సాగింది? శ్రీ‌ను తన మ్యాజిక్‌ ని చూపించాడా? వీరిద్దరూ క‌లిసి చేసిన హంగామా ఎలా ఉంది? తెలుసుకొందాం రండి!

హాంకాంగ్‌, సింగపూర్‌, మ‌లేసియా… ఇలా ప్రతి చోటా… త‌న సామ్రాజ్యాన్ని విస్తరించుకొంటాడు మాఫియా డాన్… సాధూభాయ్ (కెల్లీ డార్జ్‌). హాంకాగ్‌ లో కార్యక‌లాపాల‌న్నీ ధ‌న్‌ రాజ్ (ముఖేష్‌ రుషి) చూస్తుంటాడు. అత‌ని త‌న‌యుడే ‘బాద్‌ షా’ (ఎన్టీఆర్). త‌న దూకుడుతో ప్ర త్యర్థులలో వ‌ణ‌కు పుట్టిస్తాడు బాద్‌షా. ఆ వేగం న‌చ్చే సాధూ భాయ్‌… బాద్‌ షాకి ఓ ప‌ని అప్పగిస్తాడు. దాన్ని దిగ్విజ‌యంగా పూర్తి చేస్తాడు బాద్‌ షా. దాంతో బాద్‌ షా కి మాఫియాలో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చేస్తుంది. అయితే ఓ విష‌యంలో సాధూకీ, బాద్‌ షాకీ మ‌ధ్య విభేదాలు మొద‌ల‌వుతాయి. నీ సామ్రాజ్యాన్ని మ‌ట్టుపెడ‌తా అని సాధూభాయ్‌ తో ఛాలెంజ్ చేస్తాడు బాద్‌ షా. ఈలోగా హాంకాంగ్ పోలీసులు, ఇంట‌ర్‌ పోల్ అధికారులు బాద్‌ షా కోసం వేట ప్రారంభిస్తారు. వారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి రామారావు పేరుతో ఇట‌లీ వెళ్లిపోతాడు బాద్ షా. అక్కడ జాన‌కి (కాజ‌ల్‌) పరిచ‌యం అవుతుంది. అది ప్రేమ‌గా మారుతుంది. అయితే అప్పకే.. ఆది (న‌వ‌దీప్‌)తో పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లి పెటాకులు చేసి…. జాన‌కి మెడ‌లో మూడు ముళ్లు వేయ‌డానికి ఇండియా వ‌స్తాడు రామారావు. ఆది ఎవ‌రో కాదు.. బాద్‌ షాని ప‌ట్టుకోవాల‌ని ఎదురుచూసే ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. అస‌లు బాద్‌ షాకీ, ఆదికి మ‌ధ్య త‌గువు ఏమిటి? బాద్‌ షా జాన‌కి కోసం ఇట‌లీ ఎందుకు వెళ్లాడు? అస‌లు మాఫియాలో ఎందుకు చేరాడు? అనేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు. ఇవ‌న్నీ వెండి తెర‌పై చూడాల్సిందే. యాక్షన్‌, వినోదం… కావ‌ల్సినంత హీరోయిజం… ఇవ‌న్నీ క‌థ‌లో ఎలా మేళ‌వించాలో శ్రీ‌నువైట్లకు బాగా తెలుసు.

శ్రీ‌ను వైట్ల విజ‌య‌వంత‌మైన సినిమాల‌న్నీ ఈ ఫార్ములా అనుస‌రించి తీసిన‌వే. ఈసారీ అదే పంథాలో వెళ్లిపోయాడు. ఇట‌లీలో కాజ‌ల్‌, ఎన్టీఆర్‌, వెన్నెల కిషోర్ మ‌ధ్య స‌ర‌దా స‌న్నివేశాల‌తో సినిమా జాలీగా మొద‌ల‌వుతుంది. రివైంజ్ నాగేశ్వరరావు (ఎమ్మెస్ నారాయ‌ణ‌) ఎంట్రీతో న‌వ్వుల పంట ప్రారంభం అవుతుంది. ఎమ్మెస్ పాత్రలో రాంగోపాల్ వ‌ర్మ నుంచి బోయ‌పాటి శ్రీ‌ను వ‌ర‌కూ అంద‌రి ద‌ర్శకుల మేన‌రిజాన్నీ చూపించి… థియేట‌ర్లో న‌వ్వుల జ‌ల్లులు కురిపించాడు శ్రీ‌ను వైట్ల‌. కామెడీ పండించ‌డంలో ఈసారి ఎన్టీఆర్ కూడా కేకపుట్టిచ్చాడు. సినిమా రంగంపై వేసిన సెటైర్లు న‌వ్విస్తాయి. ఆఖ‌రికి సిద్దార్థ్, దిల్‌ రాజుల‌నూ వ‌ద‌ల్లేదు. అక్కడ‌క్కడా యాక్షన్ బ్లాకులు పెట్టుకొని మాస్ సంతృప్తి ప‌డేలా చేశాడు. తొలి భాగం ఈ స‌ర‌దా స‌న్నివేశాలే నిలబెట్టాయంటే అతిశ‌యెక్తి కాదు. సెకండాఫ్‌ లో ఆ బాధ్యత బ్రహ్మానందం తీసుకొన్నాడు. పిల్లి ప‌ద్మనాభ సింహాగా అద‌ర‌గొట్టాడు.

బ్రహ్మానందం పాత్రకు ఓ బ‌ల‌హీన‌త ఆపాదించి.. దాని ద్వారా వినోదం పండించ‌డం శ్రీ‌ను వైట్ల అల‌వాటు. దూకుడులో రియాలిటీ షో పేరుతో ఆడుకొన్నట్టే.. ఇందులో డ్రీమ్ వ‌ర‌ల్డ్ కాన్సెప్ట్ సృష్టించారు. క‌ల‌లో బ‌తికే బ్రహ్మీని చూస్తే పొట్టచెక్కలు కావ‌డం ఖాయం. తొలిస‌గం ఎమ్మెస్ చేసిన హంగామా మ‌ర్చిపోయే స్థాయిలో ఆ పాత్రని తీర్చిదిద్దాడు శ్రీ‌నువైట్ల‌. దూకుడులో ప‌ద్మశ్రీ పోలిక‌లు క‌నిపించినా.. థియేట‌ర్లో మాత్రం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

ఎన్టీఆర్ పాత్రలో నాలుగు షేడ్స్ ఉన్నాయి. ప్రతీ పాత్రకూ ఓ డిఫ‌రెంట్ స్టైల్‌, మేన‌రిజం… ఆపాదించారు. సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ మార్పు చూపించారు. ఈ విష‌యంలో ఎన్టీఆర్ తీసుకొన్న శ్రద్ధ అభినంద‌నీయం. కామెడీ, ఎమోష‌న్‌, యాక్ష న్‌…. ఇలా ప్రతి విభాగాన్నీ ట‌చ్ చేయించారు. దాంతో ఎన్టీఆర్‌ లోని పరిపూర్ణ న‌టుడికి ప‌ని దొరికిన‌ట్టైంది. సిద్దూ, దిల్‌ రాజుల‌పై సెటైర్ వేస్తున్నప్పుడు తారక్ పండించిన హావ‌భావాలూ అభిమానుల‌కు న‌చ్చుతాయి. అంతే కాదు జ‌స్టిస్ చౌద‌రి గెట‌ప్ వేసి అన్నగారిని మ‌రోసారి గుర్తుచేశారు. చివ‌ర్లో ఎన్టీఆర్ పాత పాట‌ల‌కు స్టెప్పులు వేసి.. అల‌రించారు. డాన్సులు మ‌రీ కొత్తగా క‌నిపించ‌క‌పోయినా… చేసింది ఎన్టీఆర్ కాబ‌ట్టి త‌ప్పకుండా అల‌రిస్తాయి. అమాయ‌క‌త్వం, మంచిత‌నం క‌ల‌బోసిన పాత్రలో కాజ‌ల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. బంతి ఫిలాస‌ఫీతో చెప్పిన సంభాష‌ణ‌లు న‌వ్వులు పండిస్తాయి. కాక‌పోతే.. ఆ డోసు కాస్త ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రల‌న్నీ అనుభ‌వం ఉన్న న‌టీన‌టుల‌కే ప‌డ్డాయి కాబ‌ట్టి… యాజ్‌ టీజ్ చేసేశారు.

శ్రీ‌నువైట్ల త‌న బ‌లాల‌ను మ‌రోసారి న‌మ్ముకొన్నాడు. డైలాగ్ కామెడీతో సినిమాని లాగించే ప్రయ‌త్నం చేశాడు. అయితే క‌థ‌, క‌థ‌నాలు… పాత్రల్ని ప‌రిచ‌యం చేసే విధానం, ట్విస్టులు ఇవ‌న్నీ ఆయ‌న గ‌త సినిమాల మాదిరిగాన‌నే ఉన్నాయి. దూకుడుని మ‌రోలా తీస్తే… ఇలా వ‌చ్చిందేమో అనికూడా అనిపిస్తుంది. కానీ త‌ప్పదు… ఇంత భారీ సినిమానిని సేఫ్‌ గా లాగించేయాల‌నుకొన్న అత‌ని ఆలోచ‌న నిర్మాత‌కు లాభం చేకూర్చేదే. స్ర్కీన్‌ ప్లే విష‌యంలో చాలా త‌ప్పులు చేశాడు. అనేక పాత్రలు ఉండ‌డం వ‌ల్ల‌… ప్రేక్షకుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది.  బ్రహ్మానందం, ఎమ్మెస్‌, ఎన్టీఆర్ పాత్రల‌కు మిన‌హా…మ‌రెవ్వరి పాత్రల‌పై దృష్టి పెట్టలేదు. కొన్ని స‌న్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. అస‌లు రామారావు.. హాంకాంగ్ ఎలా వెళ్లాడు? అంత పెద్ద మాఫియా ముఠాలో ఎలా చేరాడు? అనే విష‌యాలు చెప్పలేదు. త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఉన్న వైరం కూడా స‌రిగ్గా చూపింక‌లేక‌పోయాడు. సంభాష‌ణ‌ల్లో పంచ్‌ లు బాగా పేలాయి. ఎన్టీఆర్ చేత ప‌లికించిన ప్రతీ సీరియ‌స్ డైలాగ్‌… అల‌రించేదే. మా తాత నాకు ఈ పేరు పెట్టింది చ‌నిపోయిన త‌ర‌వాత స‌మాధిపై రాసుకోవ‌డానికి కాదు, చ‌రిత్ర రాయ‌డానికి.. అని చెప్పించారు. ఈ డైలాగ్‌ కి విజిల్స్ ప‌డ‌డం ఖాయం. సంభాష‌ణ ర‌చ‌యిత నైపుణ్యం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది.

త‌మ‌న్ సంగీతం వ‌ల్ల ఈ సినిమాకి పెద్దగా ఒరిగిందేం లేదు. పాట‌లు క్యాచీగా లేవు, ఎన్టీఆర్ స్టెప్పుల‌కు మాత్రం కాస్త అనువుగా ఉన్నాయంతే. నేప‌థ్య సంగీతం బిల్డప్పుల‌కే ప‌నికొచ్చింది. శ్రీను వైట్ల ప్రతి విష‌యంలోనూ దృష్టి పెడ‌తాడు. అన్నీ ట్రెండీగా ఉండేట‌ట్టు చూసుకొంటాడు. కానీ క‌థ మాత్రం పాత‌దే ఉంటుంది. ఆ విష‌యంలోనూ శ్రద్ధ తీసుకొంటే బాద్‌షా నిజంగానే బాక్పాఫీసుని షేక్ చేసేవాడేమో. ఇప్పటికీ ఫ‌ర్లేదు. వేస‌వి కాలం.. కాసేపు స‌ర‌దాగా ఎంజాయ్ చేద్దాం.. అనుకొనేవారికీ ముఖ్యంగా… ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈ సినిమా త‌ప్పకుండా న‌చ్చుతుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.5/5                                          – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version