రివ్యూ : ‘బ్యాడ్ బాయ్’

bad-boy- review

Telugu Mirchi Rating : 1.5/5 | Click here for English Review

Bad Boy Telugu Movie Review | Bad Boy Movie Rating | Bad Boy Movie Review | Bad Boy Review | Bad Boy Rating | Karthik Bad Boy Movie Review | Bad Boy Movie Story | Anushka in Bad Boy | Bad Boy Review Telugu Mirchi
Bad Boy Telugu Movie Review, Bad Boy Movie Rating, Bad Boy Movie Review, Bad Boy Review, Bad Boy Rating, Karthik Bad Boy Movie Review, Bad Boy Movie Story, Anushka in Bad Boy, Bad Boy Review Telugu Mirchi

Bad Boy Review, Rating | Bad Boy Movie Review | Bad Boy Telugu Movie Review
Swathi

1.5

‘బ్యాడ్ బాయ్’… మరీ ఇంత బ్యాడా..!

రివ్యూ

‘చచ్చిన పామును చంపకురా..’ అని చితికిపోయిన మనుషులపై జాలి చూపిస్తుంటారు. కొన్ని సినిమాలకు కనీసం ఆ కనికరం కూడా ఉండదు. సగం సినిమా చూసే పిచ్చెక్కిపోయి, కాసేపుంటే స్పృహ తప్పే పరిస్థితిలో ఉన్న ప్రేక్షకుడిని ‘విశ్రాంతి’ పేరుతో బ్రేక్ ఇచ్చి, మళ్లీ కాస్త సత్తువ తెచ్చుకోగానే శుభం కార్డు వేసే వరకూ బలవంతంగా కూర్చోబెట్టి రాచిరంపాన పెడతారు. ఆ కోవలో చేరడానికి ఓ సినిమా వచ్చింది. అదే ‘బ్యాడ్ బాయ్’. తమిళ దర్శకుల్ని తెగ మెచ్చుకొనేవాళ్లం. ఎందుకంటే.. మనకు రాని మంచి ఆలోచనలు వాళ్లకే ఎక్కువగా వస్తాయని. మనం కథల పేరుతో గాల్లో పల్టీలు కొడుతుంటే, వాళ్లు మట్టినీ మనుషులనూ నమ్ముకొని కథలు రాసుకొంటారని. అదెంత తప్పో నిరూపించడానికి ‘బ్యాడ్ బాయ్’ వచ్చింది. కార్తీకి ఉన్న క్రేజ్ ఖూనీ చేయడానికి పనిపట్టుకొని తీసిన చిత్రంలా అనిపించే ఈ ‘బ్యాడ్’ బాయ్.. కథా కమామిషూ ఇదీ!

అమెరికాలో నిషేధించిన ఓ ఔషధం ఆంధ్రప్రదేశ్ లో అమ్ముకోవడానికి జి.వి.కె (సుమన్), అల్విన్ (మెలింద్ సోమన్), ఓ స్వామిజీ (మహదేవన్) ప్రయత్నిస్తారు. అయితే ఆ ఔషధం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఆరోగ్య శాఖ మంత్రి (విసు) ఆ ఫైల్ పై సంతకం చేయడానికి నిరాకరిస్తాడు. మంత్రిని దారిలోకి తీసుకురావడానికి ఆయన కూతురు దివ్య (అనుష్క)ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. డబ్బుకోసం ఏదైనా చేసే అలెక్స్ (కార్తి)తో పది లక్షల బేరం పెట్టుకొంటారు. దివ్యని కిడ్నాప్ చేసి ఓ చోట బంధిస్తాడు అలెక్స్. ‘ఆ మందు బయటకి వస్తే లక్షలాది మంది అమాయకులు బలైపోతారు. కావాలంటే నేనే నీకు రూ. 50 లక్షలు ఇస్తా’ అని దివ్య మరో బేరం పెడుతుంది. దాంతో.. ఆ ముఠా నుంచి దివ్యని కాపాడడానికి ఒప్పుకొంటాడు అలెక్స్. ఓ వైపు నుంచి జివికె గ్యాంగ్ అలెక్స్, దివ్యలను తరముతుంటారు. మరోవైపు పోలీసుల వెదకులాట. ఆ తరవాత ఏమైంది? ఔషదం బయటకు వచ్చిందా? అలెక్స్, దివ్యల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనేదే ఈ సినిమా కథ.

ఓ భారీ ఛేజింగ్ సన్నివేశంతో ఈ సినిమా మొదలవుతుంది. ‘నరసింహనాయుడు’ టైపులో ట్రైను వెనుక సుమోలు, ‘ఇంద్ర’ స్థాయిలో హెలీకాప్టర్ ఛేజింగులూ చూపించారు. ఈ సినిమాలో యాక్షన్ బీభత్సంగా ఉండబోతోంది అనడానికి అవే సంకేతాలు. ఆ తరవాత కథ సంతానం ఇంటికి షిఫ్ట్ అవుతుంది. సంతానం చెల్లాయిలను కార్తీ ఆటపట్టించే సన్నివేశాలు, దానికి సంతానం ఇరిటేట్ అయిపోవడం, పనివాడి ఓవర్ యాక్షన్.. తలనొప్పి తీసుకొస్తాయి. ఓ సీనులో అరవ కామెడీ, ఆ తరవాత సీనులో విలన్లు కార్తీని వెతుక్కొంటూ గల్లీ గల్లీ తిరగడం – ఇది తప్ప ఫస్టాఫ్ లో మరేం ఉండదు. సంతానంని పెట్టుకొంటే కామెడీ పుట్టుకొచ్చేస్తుందనేది తమిళ దర్శకుల ఉద్దేశం కాబోలు. అది ఈ సినిమా విషయంలో ఘోరంగా పల్టీకొట్టింది. తెరపై కనిపించిన ప్రతి పాత్రా నవ్వుతుంది కానీ, ప్రేక్షకుడి మొహాన చిరునవ్వు చూళ్లేం.

ఇంట్రవల్ తరవాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని మరింత పరీక్ష పెడతాయి. అడవిలో సీన్లన్నీ పరమ రొటీన్. కనీసం ఫ్లాష్ బ్యాక్ అయినా అమోఘం, అద్భుతం అని పొరపడితే ఆ విషయంలోనూ భంగపాటు తప్పదు. మూలిగే నక్కపై తాటికాయ కాకుండా ఏకంగా తాటిచెట్టే పడితే ఎలా ఉంటుంది? గబ్బర్ సింగ్-అలెక్స్ మధ్య వీర కామెడీ సీన్లు చూసిన ప్రేక్షకుడి పరిస్థితి కూడా అదే. అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ అని ఎవరైనా అంటే వాళ్ల మాట నమ్మొద్దు. జస్ట్.. ఓ చిన్న పాత్ర. కార్తీ-అనుష్కల మధ్య కెమిస్ట్రీ గురించి దర్శకుడు అస్సలు పట్టించుకోలేదు. అసలు ఆమెను హీరోయిన్ గా ట్రీట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ సన్నివేశాల్లో మినహా స్వీటీ ఎక్కడా కనిపించదు. సినిమా అంతటా ఆమెపై తీసింది ఒకే ఒక్క పాట. ఫుట్ బాల్ ని తన్నితే ఎగురుకొంటూ వెళ్తుంది. కానీ ఫుట్ బాల్ తో మనిషిని తంతే అంతెత్తు ఎగిరి పడతాడా? వాట్ ఏ క్రియేటివిటీ? ఓమ్నీ కారు గొప్పదనం కోసమే ఇంట్రవెల్ ఫైట్ తీసుంటారు. ఓమ్నీని ఎన్ని ఖరీదైన కార్లు, ఎంత స్పీడులో ఛేజ్ చేసినా క్రాస్ చేయలేవు. పైగా ఓమ్నీ గోడలు బద్దలు కొట్టుకుంటూ మహా స్పీడుగా వెళ్లిపోతుంటుంది. ఓమ్నీని గుద్దుకొన్న మహా మహా కార్లు పల్టీలు కొట్టుకొంటూ ధ్వంసం అయిపోతాయి. ఇవన్నీ చూస్తుంటే మన దర్శకులే బెటర్.. అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కూడా మ్యాజిక్ చేయలేకపోయాడు. డీఎస్ పీ చేసిన పూర్ వర్క్.. ఇదేనేమో? ! ఫాస్ట్ బీట్ ఇచ్చినా దానికి సరితూగే డ్యాన్స్ కార్తీ చేయలేకపోయాడు. శరవణన్ ఫొటోగ్రఫీ, ఛేజింగ్ దృశ్యాలూ, ఓపెనింగ్ సీన్.. ఇవి మాత్రమే చూడ్డానికి పనికొస్తాయి. మిగతావన్నీ పేరుకు తగ్గట్టు పరమ బ్యాడే!

తమిళంలో ఫ్లాప్ అయిన ‘అలెక్స్ పాండియన్’ సినిమాని, రెండు నెలల తరవాత.. భారీ ఎత్తున ప్రచారం చేయించి.. తెలుగులో వదిలేశారు. తెలుగు ప్రేక్షకుల మనసు ఎంత విశాలమైనా ఈ బ్యాడ్ బాయ్ ని భరించడం మహా కష్టం. ఎందుకంటే వీడు బ్యాడ్ బాయ్ కాదు… వీర బ్యాడ్ బాయ్!

తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.5/5                                                                   స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version