బాలయ్య ..పవన్ కళ్యాణ్ ను చూసి నేర్చుకో..

పవన్ కళ్యాణ్ ను చూసి నందమూరి బాలకృష్ణ చాల నేర్చుకోవాలి..ఇది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఎందుకంటే గత నాల్గు, ఐదు రోజులుగా బాలకృష్ణ తీరు చూస్తే అభిమానులకు సైతం నచ్చడం లేదు. ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ అభిమానులపై, తెలుగుదేశం పార్టీ కార్య కర్తల ఫై ఓ రేంజ్ లో విరుచుకపడుతున్నాడు. నోటికి ఏది వస్తే అది తిట్టడం..పరుగెత్తి పరుగెత్తి కొట్టడం..ఫొటోస్ తీస్తున్నారని అభిమానుల ఫోన్లు లాక్కొని నేలకేసి కొట్టడం ఇవ్వన్నీ బాలయ్య లోని నిజ స్వరూపాన్ని బయటకు తీస్తున్నాయి. ఇక్కడే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను చూసి నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు అంటున్నారు.

మొన్నటి మొన్న పవన్ ఓ సభ లో ప్రసంగిస్తున్న సమయంలో ఆ అభిమాని వచ్చి పవన్ కాళ్లను గట్టిగా పట్టుకోవడం తో ఆయన కిందకు పడ్డాడు.. ఆ టైం లో పవన్ తన గొప్ప మనసును…అభిమానుల ఫై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. లేచి ఏమాత్రం ఆ అభిమాని ని కొట్టకుండా..కిందకు పంపించాడు. అంతే గానీ బాలయ్య ల బూతులు తిట్టడం గానీ కొట్టడం గానీ చేయలేదు. చాల హొందగా నడుచుకున్నారు. ఆలా మీరు ఎందుకు ఉండడం లేదని బాలకృష్ణ ను ప్రశ్నిస్తున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.