రూ.53 కోట్ల గ్రాస్​ సాధించిన బంగార్రాజు

కింగ్ నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ బంగార్రాజు. త‌న కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయ‌న మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.53 కోట్ల గ్రాస్​ సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.ఈ సినిమాలో నాగ్, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.