టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలందరికి కూడా సిటీ శివారు ప్రాంతంలో వ్యవసాయ భూములు, ఫామ్ హౌస్‌లు ఉంటాయి. అందరి మాదిరిగానే నాగార్జునకు కూడా రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డి గూడ సమీపంలో 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని నాగార్జున ఎప్పుడో కొనుగోలు చేసి వదిలేశాడు. ఇప్పుడు దాని గురించి మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. ఆ వ్యవసాయ భూమిలో కుల్లిన స్థితిలో ఒక శవం కనిపించింది. స్థానికులు వెంటనే ఆ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. ఆ శవం ఎవరిదై ఉండవచ్చు అంటూ అనుమానంతో కేసు నమోదు చేశారు. ఆ వ్యవసాయ భూమి నాగార్జునకు చెందినది కనుక మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. కాని పోలీసులు మాత్రం ఈ హత్యకు నాగార్జున ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం ఉండి ఉండదని అంటున్నారు. స్థానికంగా ఎవరో చంపివేసి అక్కడ వేసి ఉంటారని, ఆ శవం ఎవరిదో గుర్తిస్తే అసలు విషయం బయటకు వస్తుందని, ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీని మీడియాలోకి లాగి పుకార్లు పట్టించాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.