Jailer Review | జైలర్ రివ్యూ

Jailer Review

MAIN CAST: రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా భాటియా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు
DIRECTOR: నెల్సన్ దిలీప్ కుమార్
MUSIC: అనిరుధ్
PRODUCER: కళానిధి మారన్
TELUGUMIRCHI RATING : 3/5

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న మూవీ ‘జైలర్’. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటించగా.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్ మొదలగువారు ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు (ఆగష్టు 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే..

ముత్తువెల్ పాండియన్ (రజినీకాంత్) నీతీ,నిజాయితితో పనిచేసి రిటైర్డ్ అయ్యాక బార్య(రమ్యకృష్ణ), కుమారుడు అర్జున్ తో కలిసి జీవనం సాగిస్తుంటాడు. అయితే కొడుకు అర్జున్ కూడా పోలీస్ డిపార్టుమెంటులో తండ్రి భాటలోనే నిజాయితీగా డ్యూటీ చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల అర్జున్ ని విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. కొడుకు చావుకి ప్రతీకారంగా దానికి కారణమైన వాళ్ళని చంపడం మొదలు పెడతాడు ముత్హు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముత్తు ఫ్యామిలీకి ఆపద వస్తోంది. తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ముత్తు వెల్ పాండియన్ ఏం చేశాడు.. శివన్న, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ పాత్రలు ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక ఈ సినిమా రజిని వన్ మాన్ షో అని చెప్పొచు. స్టొరీ లైన్ కొంచెం విక్రం సినిమాని పోలి ఉంటుంది, కాని దర్శకుడు తెరకెక్కించిన  విధానం అధ్బుతంగా ఉందని చెప్పొచు. అతిధి పాత్రల్లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ మెప్పించారు. రజినీకాంత్ – యోగిబాబు మధ్య కామెడీ ట్రాక్ హైలైట్ అని చెప్పొచు. ఇక హీరోయిన్ పాత్రకి పెద్దగ ప్రాదాన్యత ఉండదు. మిగతావారు తమ తమ పాత్రలమెర మెప్పించారనే చెప్పొచు. 

ఫైనల్ పాయింట్ : రజినీకాంత్ వన్ మాన్ షో