రివ్యూ : మీటర్


చిత్రం: మీటర్
తెలుగుమిర్చి రేటింగ్ : 1.75/5
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పవన్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి తదితరులు
దర్శకుడు: రమేష్ కదూరి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్
విడుదల తేదీ: ఏప్రిల్ 07, 2023

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇటీవలే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తో బాక్సాఫీస్ ముందు సత్తా చాటిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘మీటర్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో రమేష్ కదూరి నూతన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మరి ఈ ‘మీటర్’ కథేంటి ? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

క‌థ‌:

అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అయితే, ఆ నిజాయితీ వల్ల తన తండ్రి పడిన కష్టాలను, అవమానాలను చిన్న తనం నుంచి చూసి.. పోలీస్ జాబ్ పైనే అసహ్యం పెంచుకుంటాడు. కొడుకుని ఎస్సై చేయాలనేది ఆయన కల.అలాంటి అర్జున్ కళ్యాణ్ తన తండ్రి కోరిక కోసం పోలీస్ గా మారాల్సి వస్తోంది. దీంతో ఆ పోలీస్ ఉద్యోగం నుండి బయటికి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే హోంమంత్రి కంఠం బైరెడ్డి(పవన్) వల్ల అర్జున్ జీవితం అనుకోని మలుపు తిరుగుతోంది. మరి అదేంటి? బైరెడ్డి వల్ల అతను ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? ఈ మధ్యలో అతుల్య రవితో ఎలా ప్రేమలో పడ్డాడు?, అసలు మగాళ్లు అంటేనే విరుచుకు పడే ఆమెను ఎలా ప్రేమలో పడేశాడు?, అలాగే అర్జున్ కళ్యాణ్ లో ఫైనల్ గా ఎలాంటి మార్పు వచ్చింది ?, మారాకా అతను ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

కిరణ్ నటన
కొన్ని డైలాగులు
విలన్ ధనుష్ పవన్ నటన

మైనస్ పాయింట్స్:

కథ, స్క్రీన్ ప్లే
అనవసరమైన యాక్షన్ సీన్స్
చాలా సన్నివేశాల్లో ఓవర్ బిల్డప్

ఫైనల్ గా: ‘మీటర్’ లో మేటర్ లేదు

తెలుగుమిర్చి రేటింగ్ : 1.75/5