పవన్.. గోపాలుడా ?

pawan
పవన్ కళ్యాణ- వెంకటేష్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ రూపొందనుంది. బాలీవుడ్ లో విజయం సాదించిన ‘ఓ మై గాడ్’ చిత్రానికి రిమేక్ ఇది. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో పరేష్ పాత్రలో వెంకటేష్, అక్షయ్ కుమార్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ తెలుగు రీమేక్ కు సంబదించిన రకరకాల టైటిళ్ళు ప్రచారంలోకి వస్తున్నాయి. మొదట ఈ చిత్రానికి గోవిందా గోవిందా, ‘దేవ దేవం భజే’ అనే పేరు వార్తల్లోకి వచ్చాయి. ఇప్పడు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. తాజాగా ‘గోపాల గోపాల’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఇది అందరికీ నచ్చిందనీ, ఇదే ఖరారు కావచ్చనీ సమాచారం. ఈ చిత్రాన్ని ఈనెల 9 ప్రారంభిస్తారు. ఆ రోజే పూర్తి వివరాలు తెలుస్తాయి.