వర్మ భార్య చేత చెంపదెబ్బ తిన్నాడట

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా సంచలనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మ ఏ విషయన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడటంతో పాటు తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఈయన తన జీవితాన్ని లీడ్‌ చేసే విధానంతో ఎంతో మంది ఆయనకు అభిమానులు అయ్యారు. ఎవరికి భయపడని రామ్‌ గోపాల్‌ వర్మ ఒకానొక సమయంలో తన భార్య చేత చెంపదెబ్బ తిన్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చాలా ఏళ్ల క్రితం భార్య నుండి విడిపోయిన వర్మ తాజాగా తనకు తన భార్యకు మద్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

నేను శ్రీదేవికి వీరాభిమానిని అనే విషయం నా భార్యకు తెలుసు. నేను ఆమెను కలవనంత కాలం నాతో సాఫీగానే ఉంది. నేను శ్రీదేవి గురించి మాట్లాడితే పాజిటివ్‌గానే రియాక్ట్‌ అయ్యేది. నేను ఎప్పుడైతే శ్రీదేవిని కలిశానో ఆమెతో సినిమా చేశానో అప్పటి నుండి ఆమెలో ఒక రకమైన భయం మొదలైంది. ఆమె వరుసగా నాపై ఏదో ఒక విషయంలో గొడవ పడేది. ఒకానొక సమయంలో రాత్రి 11 గంటలకు శ్రీదేవి నుండి ఇంటికి కాల్‌ వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో లేను. ఇంటికి వచ్చిన తర్వాత విషయాన్ని చెప్పి గొడవకు దిగింది. ఆమె మా ఇద్దరి మద్య సంబంధం ఉందని అనుమానిస్తుందని అర్థం అయ్యింది. నీ మాటలతో శారీరకంగా ఆమెకు నన్ను దూరం చేయవచ్చు. ఒకవేళ నీలో నేను ఆమెను చూస్తే అనగానే నా చెంప పగులకొట్టింది అంటూ అప్పటి విషయాన్ని నెమరవేసుకున్నాడు.