రివ్యూ : రావణాసుర


చిత్రం : రావణాసుర
విడుదల తేదీ : ఏప్రిల్ 07, 2023
నటీనటులు : రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ, శ్రీరామ్, రావు రమేష్, జయరామ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ & ఇతరులు
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : సుధీర్ వ‌ర్మ‌
నిర్మాతలు : అభిషేక్ నామా, రవితేజ
సంగీత దర్శకులు : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్ : నవీన్ నూలి

తెలుగుమిర్చి రేటింగ్ : 2 /5

మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌రుస విజ‌యాల‌తో మాంచి జోరుమీదున్నారు. ‘ధమాకా’ బ్లాక్ బ‌స్ట‌ర్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన ఆయ‌న ఆ వెంట‌నే `వాల్తేరు వీర‌య్య‌`తో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నారు. వ‌రుస‌గా రెండు విజ‌యాలు ద‌క్క‌డంతో అదే జోష్ ని ప్ర‌ద‌ర్శిస్తూ చేసిన సైక‌లాజిక‌ల్ యాక్షన్ థ్రిల్ల‌ర్ `రావ‌ణాసుర‌`. ఐదుగురు హీరోయిన్ లు, నెగిటివ్ టైటిల్.. క్రిమిన‌ల్ లాయ‌రే క్రిమిన‌ల్ గా మారితే అనే కాన్సెప్ట్ తో ర‌వితేజ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ లో న‌టించిన `రావ‌ణాసుర‌` ఎలా ఉంది?.. వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న మాస్ రాజాకు మ‌రో హిట్ ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.

క‌థ‌:

ర‌వీంద్ర అలియాస్ ర‌వి (ర‌వితేజ‌) ఓ జూనియ‌ర్ లాయ‌ర్‌. కాలేజీ రోజుల్లో తాను ప్రేమించిన సీతామాల‌క్ష్మీ (ఫరియా అబ్దుల్లా) ద‌గ్గ‌రే జూనియ‌ర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. సీతామ‌హాల‌క్ష్మి ద‌గ్గ‌రికి ఓ హ‌త్య కేసులో ఇరుక్కున్న ఫార్మా కంప‌నీ అధినేత విజ‌య్ త‌ల్వార్ (సంప‌త్‌) ను కాపాడ‌మంటూ అత‌ని కూతురు హారిక త‌ల్వార్ (మేఘా ఆకాష్) వ‌స్తుంది. అయితే ఇందుకు సీతామాల‌క్ష్మి అంగీక‌రించ‌దు. హారిక అందానికి ఫిదా అయిన ర‌వీంద్ర ఈ కేసుని తానూ తీసుంటాడు. కానీ ఇక్కడ నుంచి ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి ఈ మర్డర్స్ చేసింది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ కథలో మిగతా హీరోయిన్స్ పాత్రలు ఏంటి? ఆ కిల్లర్ దొరుకుతాడా అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

రవితేజ డిఫరెంట్ క్యారక్టర్
కథలో ట్విస్టులు
ఇంటర్వెల్ బాంగ్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ ఆఫ్ లో స్క్రీన్ ప్లే
కథలో లాజిక్స్ మిస్ అవ్వడం
సందర్భం లేకుండా పాటలు

ఫైనల్ పాయింట్ : రొటీన్ రివెంజ్ డ్రామా

తెలుగుమిర్చి రేటింగ్ : 2 /5