రివ్యూ : శాకుంతలం | Shaakuntalam Movie Review

Shaakuntalam Movie Review

నటినటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ తదీతరులు
దర్శకత్వం: గుణశేఖర్‌
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి. జోసెఫ్‌
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

తెలుగుమిర్చి రేటింగ్ : 2.25/5

సమంత లీడ్ రోల్ లో నటించిన మూవీ శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మాతగా మారి తెరకెక్కించాడు. ఈ మూవీ చాలా సార్లు వాయిదాలు పడుతూ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. పౌరాణిక చిత్రంగా వచ్చిన ఈ మూవీపై ఓ మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్నాయి. యశోద సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత.. ఈ మూవీతో హిట్ అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
శకుంతల (సమంత) జననంతోనే సినిమా మొదలు అవుతుంది. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడు మేనక ని భూలోకంకి పంపిస్తాడు. ఆ తర్వాత మేనక ఒక అమ్మాయికి జన్మని ఇచ్చి, ఆ అమ్మాయిని భూలోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అడవిలో ఆ అమ్మాయిని చూసిన కన్వ మహర్షి శకుంతల అని పేరు పెడతారు. ఒక రోజు ఆయన ఆశ్రమానికి వచ్చిన దుష్యంతుడు (దేవ్ మోహన్) శకుంతలని చూస్తాడు. వారిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు. అతను రాజు కాబట్టి ఆ మర్యాదలతో తన రాజ్యానికి ఆహ్వానిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు అయినా సరే దుష్యంతుడు మళ్ళీ తిరిగి రాడు. దీంతో శకుంతల దుష్యంతుడి కోసం వెళ్తుంది. అక్కడ శకుంతలని చూసిన దుష్యంతుడు తాను ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తాడు. శకుంతల భరత (అల్లు అర్హ) కి జన్మనిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దుష్యంతుడు శకుంతలని ఎందుకు గుర్తుపట్టలేదు? శకుంతల ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీటన్నిటిని శకుంతల ఎలా అధిగమించింది? దుష్యంతుడికి ఏమయ్యింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

నటీనటుల పెర్ఫార్మన్స్ :

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోతుంది. కాకపోతే ఆమె కెరీర్ లో పౌరాణిక పాత్రలో నటించడం ఇదే మొదటిసారి.అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్‌ చెప్పుకోవడం మైనస్‌ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్‌ అతికినట్లు అనిపించదు. శకుంతలగా ఆమె డిఫరెంట్ వేరియేషన్లలో నటించింది. ఓ ప్రేమికురాలుగా, భర్త దూరమైతే విరహ వేదన భరించే భార్యగా, గర్భిణిగా నటించి మెప్పించింది. ఇక దుష్యంతుడిగా చేసిన దేవ్ మోహన్‌ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. మోహన్ బాబు, గౌతమి, ప్రకాష్ రాజ్, శరత్ బాబు, అనన్య నాగళ్ల వారి పాత్రల మేరకు బాగానే నటించారు. ఇక అల్లు అర్హ కూడా క్లైమాక్స్ లో బాగానే ఆకట్టుకుంది.

ప్లస్‌ పాయింట్స్ :

సమంత నటన
గుణశేఖర్ దర్శకత్వం
విరామ, పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్స్‌ :

నెమ్మదిగా సాగే కథనం
గ్రాఫిక్స్‌
సాగదీత సన్నివేశాలు
ఓకే ఓకే అనిపించే సాంగ్స్
అక్కడక్కడా లాజిక్స్ మిస్

ఫైనల్ పాయింట్ : అంతగా ఆకట్టుకొని శకుంతల