HIT – The 3rd Case : నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: The 3rd Case’ మే 1న పాన్ ఇండియాగా విడుదలకు సిద్ధమైంది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా ‘తను’ అనే స్పెషల్ సాంగ్ విడుదలైంది.
Also Read : రివ్యూ : మన ఇద్దరి ప్రేమ కథ
ఒకే టేక్‌లో చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్, నాని పాత్రలోని లోతైన భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించింది. ఇక మిక్కీ జె మేయర్ మ్యూజిక్, అనిరుధ్ రవిచందర్ గాత్రం, రాఘవ్ రాసిన భావోద్వేగమైన సాహిత్యం ఈ పాటను మంత్రముగ్ధం చేసేలా మార్చాయి. సినిమాలోని క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌కు విరుద్ధంగా సున్నితమైన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రీనిధి శెట్టి పాత్రను కలవడానికి వెళ్తున్న నాని హ్యాపీ మూడ్‌లో కనిపించే కేఫ్ రీయూనియన్ సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ ప్రతీ ఫ్రేమ్‌ని మేజికల్‌గా చూపించగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది.