వారసుడు మూవీ … పాత చింతకాయ పచ్చడే …


సినీ అభిమానులకు సంక్రాంతి పండుగ ఎప్పుడో మొదలయ్యింది. అజిత్ తెగింపు తో మొదలైన ఈ సంక్రాంతి రేసు నేడు విడుదలైన వారసుడు సినిమాతో కొనసాగుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వరీసు. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ సినిమా కోసం దిల్ రాజు పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాలకృష్ణ, చిరంజీవి తో పోటీకి దింపాలనుకున్నాడు. కానీ, టాలీవుడ్ నిర్మాతల మండలి ఒత్తిడి వలన దిల్ రాజు వెనక్కి తగ్గాడు. ఇక జనవరి 11 న ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అందుకుంది. అక్కడ విజయ్ రేంజ్ ను బట్టి పర్లేదు అనిపించింది.

ఇక ఈ సినిమా ఈరోజు తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా చూసిన వారు మాత్రం వారసుడు పాత చింతకాయ పచ్చడినే చూపించారు. వంశీ.. నాలుగు ఐదు పాత సినిమాలను మిక్స్ చేసి విజయ్ తో యాక్షన్ సీన్స్ చేసి వారసుడు మూవీని రిలీజ్ చేశాడు. ఇలాంటి సినిమా తమిళ ప్రేక్షకులు చూడలేదేమో గాని తెలుగులో ఈ జానర్లో సినిమాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఈ సినిమా రిసల్ట్ తో వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలకి కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాల టాక్.