కొన్ని పండగలు మన శీతోష్ణ స్తితిగతుల వల్ల ఏర్పడ్డాయి.
మరి కొన్ని సామాజిక జీవన విధానం నుండి వొచ్చాయి.
పండగలు కొన్ని అలవాట్లుని సంసృతిని పరిచయం చేస్తాయి.
ఉగాది : ఛైత్ర శుద్ధ పాడ్యమి రొజు జరుపు కుంటారు. ఉగాది కేవలం ఆంధ్రులమే కాదు కన్నడిగులు, మహరాష్ట్రలు కూడా జరుపుకుంటారు. బ్రహ్మ స్రుష్టి ని ఈ రొజే ప్రారంభించినట్టు దేవతలకు ఈ రొజునే పనులు అప్పగించినట్టు బ్రహ్మాండ పురాణం లో ఉంది. అందుకే ఇదేరొజు సంవత్సరాది అయ్యింది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి శ్రీరాముడు వనవాసానంతరం ఛైత్ర శుధ్ద పాడ్యమి రోజు తిరిగి రాజ్యానికి వెళ్ళాడు . వసురాజు తపస్సుకి మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమై వరాలిచ్చాడు. అంత పవిత్ర మైన రొజు ఛైత్ర శుద్ధ పాడ్యమి.
ఈ రోజు చేయవలసిన పనులు : ఇంటిని శుబ్రపరచి మామిడి తోరణాలతో అలంకరించి, గుమ్మాలకి పసుపు రాసి వరి ( బియ్యంపిండి) పిండి , కుంకుమ తో బొట్లు పెట్టాలి.
అభ్యంగాన స్నానం అంటే నువ్వుల నూనె ఒంటికి రాసుకుని, తల ( మాడు ) కి కొంచెం నూనె రాసుకుని తలంటు పోసుకోవాలి… హిందువులు యే శుభకార్యమైన తల స్నానం చేయడం తప్పనిసరి. ఈ ఉగాది రోజున తలస్నానo చేయని వారు నరకానికి పోతారని శాస్త్రం చెబుతోంది…….
3. కొత్త బట్టలు,కొత్త ఆభరణాలు ధరించాలి, ( పూర్వులు కొత్త గొడుగు, కొత్త విసనకర్ర కూడా ఉగాది రోజే వాడేవారు. కారణం చైత్రం నుండి వేసవి కాలం మొదలవుతుంది ఎండలు ఎక్కువగా ఉంటాయి అందుచేత విసనకర్ర గొడుగు కొత్త సంవత్సరం లో వాడి ఉంచుకునేవారు )…..
పిండి వంటలు ఎవరికీ తోచినవి వారు చేసుకుంటారు…… కానీ అన్నిటికంటే ముందే ఉగాదిపచ్చడి తినాలి పరగడుపున…… ఉగాది పచ్చడి మావిడికాయ, వేప పువ్వు, చింత పండు, బెల్లం వేసి చేస్తారు…. కానీ తరవాత తరవాత అరటి పండు, పొట్నాల పప్పు, మిరియాలు, చెరకు ముక్కలు వేస్తున్నారు…. షడరుచుల సమ్మేళనం….. జీవితం కూడా ఇలాగే ఉంటుందని… ఉండాలిని నమ్ముతారు….
ఉగాది ని వసంత ఉత్సవం, నింబ కుసుమ ( వేప పూవు ) భక్షణం, చూత కుసుమ భక్షణం ( మావిడి పూవు ) అంటారు. మాములుగా అయితే మావిడి పువ్వు కూడా వేస్తారంట కానీ ఉగాది టైం కి మావిడి కాయలు దొరుకుతాయి పువ్వు టైo అయిపోతుంది అందుకే లేత మావిడి కాయలు వేస్తారు… వేప ఆరోగ్యానికి మంచిదని వేప పువ్వు వేస్తారు…
స్వర్గం లో ఉన్న Ambrosia చెట్టు అంశ తో భూలోకం లో వేప చెట్టు పుట్టింది అని మహారాష్ట్రుల నమ్మకం.
మహారాష్ట్రులు వేప పువ్వు తో పాటు వేపాకు కూడా తింటారు. ఇలా ఉగాది రోజున రెండిటిలో ఏది తిన్న మంచిదే.
ఉగాది పచ్చడి కి కొత్త బెల్లం కొత్త చింత పండు మాత్రమే వాడేవారు మన పెద్ద వాళ్లు.. కారణం ప్రతి వస్తువుకి దోషం ఉంటుంది అంట ఆ దోషాలు ఆయా సందర్బమ్ లో తొలగి పోతాయి…. అలా చింతపండుకి బెల్లం కి ఉన్న దోషం ఉగాది తో పోతుంది అందుకే ఈ రోజున అన్ని కొత్తవి వాడతారు.
మావిడికాయ కూడా ఉగాది వరకు తినేవారు కాదు ఉగాదికి పచ్చడి చేసి దేవుడికి నివేదించి తినేవారు… ఇప్పటికి కొంతమంది అదే పద్దతి fallow అవుతున్నారు…
పంచాంగ శ్రవణం :-
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణం, అనే అయిదింటి కలయిక.
సంపద కోసం తిధి, ధీ ర్ఘాయువు కోసం వారం, పాప విముక్తి కోసం నక్షత్రం, రోగ రక్షణకి యోగం,విజయం కోసం కరణం.
ఉగాది రోజున కొత్త పంచాంగ కి పూజ చేసి దేవాలయం లో పంచాంగ శ్రవణం చేస్తారు..పంటలు గూర్చి, వర్ష పాతం, రాజ్యాపూజ అవమానలు, ఆదాయ వ్యయాలు, గ్రహణ కాలాలు, కందాయ ఫలాలు మొదలైనవి చెప్తారు.
ఉగాది రోజునుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి వసంత కాలం + వసంత ఋతువు కావున ఈ రోజున కలస పెట్టి
తొమ్మిది రోజులు పూజ చేస్తారు ఇలా చేస్తే అప మృత్యు భయం తొలుగునని మన పురాణాలూ చెబుతున్నాయి.
ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక చలివెంధ్రాలు కూడా ఈ రోజు నుండి మెదలుపెడతారు.
ఏరువాక :-
ఏరువాక అంటే దున్నటం. ఎద్దులు కట్టి ఉన్న నాగలిని యేరు అంటారు. మంచి ముహూర్తం లో నాగలికి, ఎద్దులకి పూజ చేసి నాగలికి పాత తాళ్ళు తీసి కొత్త తాళ్ళు పసుపురాసి కడతారు, ఎద్దులకి రావి మండలు కడతారు, తరవాత మూడు రోజుల పాటు నాగలి దున్నరు, ఎడ్లు ను పని చేయించరు.
నాగలి లేని వాళ్ళు వ్యవసాయ పనిముట్లు వేటికైనా పూజ చేస్తారు. ఉగాది రోజు తప్పనిసరిగా ఏరువాక పోస్తారు… ఒక వేల ఈ రోజు అవకపోతే మంచిరోజు చూసి ఎరువాకా పూస్తారు. ముహూర్తం లేకుండా నాగలి తో కానీ,ఎడ్ల తో కానీ వ్యవసాయం చేయరు.
ఉగాది రోజున అనేక వ్రతాలూ చేసుకుంటారు.
శ్లోకం.
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం ||
ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.