గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు ?


గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ, ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు. ‘ప్రదక్షిణం’ లో ‘ప్ర’ అనే అక్షరము పాపాలకి నాశనము.. ‘ద’ అనగా కోరికలు తీర్చమని, ‘క్షి’ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, ‘ణ’ అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం

అయితే ప్రదక్షిణలు చేసేటప్పుడు భగవంతున్ని ధ్యానిస్తూ, మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం. ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే. రోడ్డు మీద నడిచినా ఒకటే. ఇకపోతే అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి? కొందరు 3 సార్లు చేస్తే, మరికొందరు 5 లేదా 11 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో వుండాలి.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం