జగనన్న విద్యా దీవెన.. రేపే ఖాతాల్లోకి సొమ్ము


విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. తిరువూరులో జరిగే సభలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నాల్గవ విడత సొమ్మును(700 కోట్లు) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. వాస్తవానికి తిరువూరులో ఈరోజే ముఖ్యమంత్రి జగన్ సభ జరగాల్సి ఉండగా సభావేదికకు పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యటనను 19కి వాయిదా వేశారు.

కాగా పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ తదితర కోర్సుల్లో చదివే అర్హులైన విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నారు. ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతంలో పేదలకు చదువు భారంగా మారింది.. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు.. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం దిశగా పనిచేశాడు.. కానీ, వైఎస్‌ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు . కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు.. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు.. వైఎస్ జగన్ ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన చేరువ చేశారని తెలిపారు. రేపు 11 లక్షల మందికి 700 కోట్ల రూపాయలు అందించనున్నారని వెల్లడించారు.. చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. అందుకే విద్యకు పెద్దపీట వేశారని తెలిపారు వెల్లంపల్లి శ్రీనివాస్‌.