మంత్రి మాణిక్యాల అదుపు చేయగలడా ?

భాజాపా – తెలుగు దేశంల మిత్రబంధం ఇటీవల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ మిత్ర బంధాన్ని విస్మరిస్తుందని భాజాపా నేతలు విష్ణుకుమార్, సోము వీర్రాజు లాంటి వారు బహిరంగానే అంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిథులని కూడా తమ ఖాతాలోనే వేసుకొని క్రెడిట్ కొట్టేస్తున్నారన్నది భాజాపా నేతల ప్రధాన ఆరోపణ.

మరోవైపు, టీడీపీ నేతలకు భాజాపాపై కామెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది. భాజాపా మిత్రపక్షం కావడంతో ఆ పార్టీ నేతలపై ఎలాంటి కామెంట్స్ చేయవద్దని సీఎం చంద్రబాబు నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భాజాపా నేతలు అప్పుడప్పుడు హద్దులు మీరిన టీడీపీ నేతల నుంచి ఆ రేంజ్ ప్రతి ఘటన రావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు మాదిరిగా తమ నేతలని అదుపులో పెట్టుకొంటామని అంటున్నాడు మంత్రి మాణిక్యాల రావు.

టీడీపీ మిత్రబంధం పాటిస్తుంది. తమ భాజాపా నేతలని అదుపు చేస్తామని ఆయన అంటున్నారు. మరీ.. మాణిక్యాలకు సాధ్యపడేనా ? గతంలోనూ మంత్రి మాణిక్యాలకు టీడీపీ ఏమాత్రం మర్యాద ఇవ్వడ లేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. మాణిక్యాల శాఖ పరమైన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొంటున్నాడనే ప్రచారం జరిగింది. అలాంటి మాణిక్యాల రావు భాజాపా నేతలని కంట్రోల్ చేయడంలో విజయవంతం అవుతాడా ? ఏమో చూద్దాం.. !