LPG Gas : మహిళలకు మోదీ కానుక.. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింపు


మహిళా దినోత్సవం రోజున మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా తమ ప్రభుత్వం LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గిస్తున్నట్లు మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది అని పేర్కొన్నారు. వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు మరియు వారికి ‘జీవన సౌలభ్యం(ఈజ్ ఆఫ్ లివింగ్)’ ను అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది అని మోదీ తెలిపారు.

కాగా ఉజ్వల పథకం ద్వారా అందిస్తున్న రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ గురువారమే ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతేడాది రాఖీ సందర్భంగా మహిళలకు గిఫ్ట్‌గా గ్యాస్ సిలిండర్ ధరల్ని రూ. 200 చొప్పున మోదీ ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 955 గా ఉండగా.. కేంద్రం తాజా నిర్ణయంతో అది రూ. 855కి చేరనుంది.