రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం..

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభంమైన పోలింగ్‌ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్ర 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోం, బిహార్‌, ఒడిశాల్లో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లలో 3 సీట్ల చొప్పున, జమ్మూకశ్మీర్‌లో 2 సీట్లు, మణిపూర్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ సీటుకు పోలింగ్‌ జరగనుంది.