పవన్ ‘ప్రాణహాని’ యాత్ర…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల అనంత పురం పర్యటన ముగిసింది. ఈ యాత్ర వల్ల పవన్ కు ఎంత ఉపయోగమో తెలియదు కానీ ఈ యాత్ర వల్ల అభిమానులకు మాత్రం ప్రాణ హాని మిగిలింది. సోమవారం హిందూపురంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం గందరగోళం గా , తోపులాటగా మారింది. యాత్ర లో భాగంగా చివరి రోజైన సోమవారం హిందూపురంలోని జేవీఎస్‌ ప్యాలెస్‌లో జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పటు చేసారు.


ఈ సమావేశానికి భారీగా అభిమానులు , కార్య కర్తలు హాజరయ్యారు. ఇందులో కొంతమంది అభిమానుల అత్యుత్సాహం కారణంగా నలుగురికి గాయాలు కాగా , అందులో ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. అభిమానులంతా ఒకరికి ఒకరు తోపులాట చేసుకున్నారు.. ఇందులో నలుగురు అభిమానులకు గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన జయచంద్ర, నరసింహా మూర్తి, మంజునాథ్ అనే యువకులను చికిత్స కోసం హిందూపురం ఆసుపత్రికి తరలించారు.

వీరిలో జయచంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో తీవ్రంగా గాయపడిన జయచంద్రను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాన్ తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించారు. ఈ ఘటనలు చూసి ప్రతిపక్షాలు పవన్ యాత్ర కాదు ప్రాణ హాని యాత్ర అంటూ కామెంట్స్ వేస్తున్నారు.