జార్ఖండ్‌లో రాష్ర్టపతి పాలన?

jarkhandజార్ఖండ్‌ లో రేపోమాపో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార భారతీయజనతా పార్టీకి జేఎంఎం మద్ధతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సీఎం అర్జున్‌ముండా కూడా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సయీద్‌ అహ్మద్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా జార్ఖండ్‌ రాష్ర్టంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో ఒకట్రెండు రోజుల్లో రాష్ర్టపతి పాలన విధించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు