బీజీపీ కి స్టార్ హీరో దొరికాడోచ్..

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎన్నికల హవానే నడుస్తుంది..రాజకీయనేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్..వైసీపీ..జనసేన..టీడీపీ పార్టీల తరుపున సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుండగా..బీజీపీ దగ్గరికి వచ్చేసరికి సినీ గ్లామర్ తగ్గింది..ఉన్నకొంతమంది కూడా చిన్న చితక నటి నటులే కావడం తో ఆ పార్టీ కి సినీ గ్లామర్ తక్కువగా ఉందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజీపీ పార్టీకి ఓ స్టార్ హీరో దొరకడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

తమిళ్..తెలుగులో మంచి గుర్తింపున్న నటుడు సురేష్ గోపి.. బీజీపీ తరుపున బరిలోకి దిగుతున్నాడు.
కొన్నేళ్ల కిందట కమలం పార్టీ తీర్థం పుచ్చుకొని.. రాజ్యసభ ఎంపీగా కూడా నామినేట్ అయ్యారు. ఇప్పుడు సురేష్ గోపిని ప్రత్యక్ష రాజకీయానికి కూడా వాడుకుంటోంది బీజేపీ. ఆయనకు త్రిశూర్ ఎంపీ టికెట్ ను ఖరారు చేసింది కమలం పార్టీ. మరి సురేష్ గోపి కి కేరళ వాసులు ఎంపీగా నిర్ణయిస్తారో లేదో చూడాలి.