నేడే చింతన్ సదస్సు

chinthan shibhirకాంగ్రెస్ రెండు రోజుల చింతన్ శిబిర్ ఈరోజు (శుక్రవారం) జైపూర్ లోని బిర్లా ఆడిటోరియం ఆవరణలో ప్రారంభం కానుంది. 2014లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడామే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులతో పాటు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ శివిర్లో పాల్గొంటున్నారు.

ఈ సదస్సుకు మన ఏపీ నుండి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు. వీరిద్దరూ ఇప్పటికే జైపూర్ కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జైపాల్రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, పల్లంరాజు, చిరంజీవితో పాటు రేణుకా చౌదరి, వి. హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కే కేశవరావు సదస్సుకు హాజరు కానున్నారు. వీరితో పాటు రాష్ట్రం నుంచి 131 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. రాజకీయ సవాళ్లపై ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ ఎన్నికల ముందు పొత్తులపై వ్యూహ పత్రాన్ని సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.