రివ్యూ : బ్యాక్ బెంచ్ స్టూడెంట్

Back Bench Student Review, Rating | Back Bench Student Movie Review | Back Bench Student Telugu Movie Review

Back Bench Student Review, Rating | Back Bench Student Movie Review | Back Bench Student Telugu Movie Review
Back Bench Student Review | Back Bench Student Movie Review | Back Bench Student Telugu Movie Review | Back Bench Student Rating | Simbhu Song | Simbhu Sings Song | Simbhu Back bench student song

తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.75/5 | Click here for English Review

Back Bench Student Review | Back Bench Student Movie Review | Back Bench Student Telugu Movie Review | Back Bench Student Rating | Simbhu Song | Simbhu Sings Song | Simbhu Back bench student song

Back Bench Student Review, Rating | Back Bench Student Movie Review | Back Bench Student Telugu Movie Review
Swathi

Back Bench Student Review | Back Bench Student Movie Review | Back Bench Student Telugu Movie Review | Back Bench Student Rating | Simbhu Song | Simbhu Sings Song | Simbhu Back bench student song
Back Bench Student Review | Back Bench Student Movie Review | Back Bench Student Telugu Movie Review | Back Bench Student Rating | Simbhu Song | Simbhu Sings Song | Simbhu Back bench student song

3

రివ్యూ :

పరీక్ష తప్పాడు.. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’

ఓ ఆదివారం పూట… మంచి ఘుమఘుమలాడే బిర్యాని వండుకుందామని అన్నీ రెడీ చేసుకుంటాం. సరంజామా అంతా ఓకే. తీరా… వంట మొదలెట్టాక ఓ చిలిపి ఆలోచన వస్తుంది. బిర్యానిలో కాస్త మైదా వేస్తే ఎలా వుంటుంది? క్యారెట్ ముక్కలు వేయడం కామన్. ఈ సారికి మనకు ఇష్టమైన వంకాయ్ జోడిస్తే? మామిడి కాయల సీజన్ కదా… రెండు ముక్కలు అవీ వేసేస్తే? ఇలా బిర్యానికి ఏం కావాలో అవన్నీ మానేసి, మనకేం నచుతాయో కలిపి వండేస్తే బిర్యాని స్థానంలో కిచిడీ తయారవుతుంది. సినిమా కూడా అంతే. ఏదో తీద్దాం అనుకుంటారు. తీయాలనుకున్న కథ మంచిదే. కానీ ట్రెండు కోసమనో, సొంత ఇష్టాల కోసమనో, లేదంటే ఫలానా వర్గం ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశ్యంతోనో ఒకటీ, ఒకటీ జోడిస్తూ అసలు కథని మరుగున పడేస్తారు. దాంతో బిర్యాని చేద్దామనుకుంటే కిచిడీ తయారైనట్టు, ఏదో తీద్దాం అనుకుంటే ఇంకేదో ప్రత్యక్ష మవుతుంది. ఈ ఉపోద్ఘాతానికీ, ఈ ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాకీ సంబంధం ఏమిటంటారా….? అయితే మీకు ఈ సినిమా స్టొరీ చెప్పాల్సిందే.

కార్తీక్ (మహాత్ రాఘవేంద్ర) బ్యాక్ బెంచ్ స్టూడెంట్. క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు, షికార్లకు తిరుగుతుంటాడు. ఇంట్లోవాళ్ళ పోరు పడలేకే ఇంజనీరింగ్ చదువుతాడు. కానీ ఏం లాభం? 16 సబ్జెక్ట్స్ తప్పుతాడు. ఆ విషయం ఇంట్లో చెప్పకుండా పాస్ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తాడు. కార్తిక్ కి ఓ ప్రేమకధ వుంది. ప్రియాంక (అర్చనా కవి)ని ప్రేమిస్తాడు. ఆమెకు కుడా కార్తీక్ అంటే ఇష్టం. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఎమ్మెస్ చేయాలనేది ఆమె కల. ఇంట్లోవాళ్ళు కూడా అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒకవైపు కార్తీక్ ని వదిలి వెళ్ళలేక, మరో వైపు తన కలని చంపుకోలేక సతమత మవుతుంది. ప్రియ అమెరికా వెళ్ళాలనుకోవడం కార్తీక్ కి కూడా నచ్చదు. అయినా సరే తన గోల్ కోసం కార్తీక్ ని కాదని అమెరికా వెళ్తుంది. కొన్ని రోజులు బాధపడి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు కార్తీక్. ఈలోగా చైత్ర (పియా బాజ్ పేయ్) పరిచయం అవుతుంది. ఆమెకు దగ్గరవుతాడు. ఇంట్లో కార్తీక్ ఇంజనీరింగ్ తప్పాడన్న నిజం తెలిసిపోతుంది. దాంతో గొడవ జరుగుతుంది. ‘నా కాళ్ళ మీద నేను నిలబడతా’ అని బయటకు వచ్చేస్తాడు. తనకున్న తెలివితేటలతో మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. చైత్రతో జీవితం హ్యాపీ అనుకున్నప్పుడు మళ్ళీ ప్రియాంక అమెరికా నుంచి కార్తీక్ కోసం వచ్చేస్తుంది. అప్పుడు ఏమయ్యింది? కార్తి మళ్ళీ ప్రియాంక కు దగ్గరయ్యాడా? లేదంటే చైత్ర తో నే వున్నాడా? అనేదే ఈ సినిమా కథ.

పరీక్షలో తప్పినంత మాత్రాన వాళ్ళు జీవితంలోనూ ఫెయిల్ అవుతారని చెప్పలేం. మార్కులు వేరు, జీవితం వేరు – ఈ అంశం చుట్టూ అల్లిన ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ప్రేమ కధ ఇది. అందుకే ‘వాడి బ్రేక్ అప్ లవ్ స్టొరీ’ అనే ఉప శీర్షిక జోడించారు. నిజానికి సినిమా పేరుకి తక్కువ, టాగ్ లైన్ కి ఎక్కువ న్యాయం చేసిన సినిమా ఇది. మేధావి తనానికీ, మార్కులకు సంబంధం లేదు అనే విషయం ఉప కథ అయ్యింది. బ్రేక్ అప్ లవ్ స్టొరీ మీదే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. దాంతో అసలు కంటే కొసరు ఎక్కువగా కనిపించింది. కథ ఎక్కడో మొదలై, ఇంకెక్కడో పాకాన పడి, మరెక్కడికో దారి తీస్తుంది. లవ్ స్టొరీ కాస్త ట్రయాంగిల్ టర్న్ తీసుకుంటుంది. ఆ తరవాత ఏముంటుంది? అంతా మాములే. ఒకరు సైడ్ అయిపోయి మరొకరికి తన స్థానం త్యాగం చేస్తారు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. టైటిల్ చూసి ఇదేదో కాలేజీ స్టొరీ అనుకుంటాం. కానీ మధుర శ్రీధర్ ఇంకేదో చూపించాడు.

తమిళ కథానాయకుడు మహాత్ కి ఇదే తొలి తెలుగు సినిమా. బాగానే చేశాడు గానీ, అతని నటన తమిళం నుంచి దిగుమతి చేసుకునేంత గొప్పగా లేదు. ఎనర్జిటిక్ గా ఉండాల్సిన సన్నివేశాల్లో నీరసంగా, నీరసంగా ఉండాల్సిన చోట హుషారుగా చేశాడు. అర్చన కవి… హావభావాల విషయంలో చాలా మొహమాట పడింది. డబ్బులు తక్కువ ఇచ్చారేమో, నటనలో మరీ పిసినారితనం ప్రదర్శించింది. గొప్ప అందగత్తె కూడా కాదు. పియా బాజ్ పేయ్ ఓకే. అయితే మహాత్, పియా జంట చూడబుల్ గా లేదు. ఇద్దరు కధానాయికలు ఉన్నారన్న మాటే గానీ, ఒక్కరి పాత్ర కూడా సరిగా ఎలివేట్ చేయలేదు. హీరోకీ క్లారిటీ లేదు. తనకి ఏం కావాలో పియాకే కాదు, కార్తీక్ కి కుడా తెలీదు. తన స్నేహితురాలిని ప్రేమించి మోసం చేసాడని కార్తీక్ ఒకడిని చితగ్గొట్టేస్తాడు. మరి కార్తీక్ ఏం చేశాడు. పియా అమెరికా వెళ్ళిన వెంటనే ఆలస్యం చేయకుండా మరో అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. ఇక హీరో పాత్రే ఇంతలా పల్టీ కొడితే సినిమా తేరుకునే ఛాన్స్ ఎక్కడిది?

సన్నివేశాలు కూడా షార్ప్ గా ఉండకుండా… ప్రేక్షకులకి ‘క్లాస్’ పీకుతున్న ధోరణిలో సాగుతాయి. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా సమర్ధవంతంగా తీయలేకపోయాడు దర్శకుడు. ‘హ్యాపీ డేస్’ ప్రభావం కూడా కొంత కనిపించింది. అలీ తనకు తగని పాత్రలో కనిపించాడు. కరీనా కపూర్ గా బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చినప్పటికే సినిమా మునుగుతూ తేలుతూ వుంది. ఆయన వచ్చి పూర్తిగా ముంచేసాడు. అసలు ఆ పాత్ర ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్లిందో దర్శకుడికే తెలియాలి. సునీల్ కాశ్యప్ సంగీతంతో విధ్వంసం సృష్టించాడు. మనకు ఇష్టమైన ‘జగడ జగడ జగడం’, ‘రాజాధి రాజాధి రాజా’ పాటలను ఖూనీ చేసి పారేశాడు. మెచ్చుకోదగినది ఏమైనా వుందంటే అది ఫోటోగ్రఫీ మాత్రమే. ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ పోయేలా రిచ్ గా తీర్చిదిద్దాడు. 16 సబ్జెక్ట్స్ తప్పినా ఓ తెలివైన స్టూడెంట్ కధ చెప్పడంలో పూర్తిగా తడబడి, దర్శకుడిగా తాను అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఫెయిల్ అయ్యాడు మధుర శ్రీధర్.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.75/5                                 – స్వాతి                                                                                                                                

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version ….