రాశి ఫలాలు : దిన ఫలాలు (29-01-2020)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వేడుకలు పార్టీల్లో మితంగా వ్యవహరించండి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు.

వృషభం :

వస్త్ర గృహోపకరణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విందులు, వేడుకల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్థాంతరంగా ముగించాల్సి వుంటుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం.

మిథునం :

కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. ఉన్నతాధికారుల తనిఖీలు, పర్యవేక్షణలో ఏకాగ్రత ముఖ్యం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు వినియోగదారులతో సమస్యలు తలెత్తుతాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

కర్కాటకం :

వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనూకూలిస్తాయి. స్త్రీలు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం :

మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి పై అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.

కన్య :

ఆర్థిక ఇంబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి విందులు, వేడుకల్లో పాల్గొంటారు. నిర్మాణాలలో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఖర్చులు, చెల్లింపులు అధికంగా ఉంటాయి.

తుల :

విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్య అవసరం. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ప్రమోషన్. ప్రత్యేక ఇంక్రిమెంట్లు, బోనస్ వంటి శుభపరిణామాలుంటాయి. మీ సంతానంతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు

వృశ్చికం :

వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. బోనస్ వంటి శుభపరిణాలుంటాయి. మీ సంతానంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

ధనస్సు :

వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. చిన్నతరహా పరిశ్రమలు, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి. పురోభివృద్ధి. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు.

మకరం :

స్త్రీలు కుటుంబ పరిస్థితులతో సర్దుకుపోవడం క్షేమదాయకం. చేతి వృత్తుల వారు, నిరుద్యోగులు ఇచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ల కోసం అన్వేషిస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి.

కుంభం :

పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయుల నుంచి బహుమతులు అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. విద్యార్థుల్లో మందకొండితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటు చేసుకుంటాయి. బంధువుల రాక ఉల్లాసాన్నిస్తుంది.

మీనం :

దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీ కళత్ర మొండివైఖరి, పట్టుదల మిమ్మలను ఇరకాటంలో పెడుతుంది. ఇరుగుపొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601