కోడెల కి తెలుగుదేశం అండ .?

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబం చేసిన మోసాలు ఒక్కోటిగా బయటకొస్తున్నాయి. వారి మోసాలు చూస్తుంటే ఇంత దారుణమా అని అనుకోకుండా ఉండలేం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం తో వారికీ భయపడి ఎవరు కూడా వారి మోసాలను బయటకు తెలుపలేకపోయారు. కానీ ఇప్పుడు అధికారంలోకి జగన్ రావడం..జగన్ సైతం కోడెల ఫ్యామిలీ ని టార్గెట్ చేయడం..మీకు జరిగిన అన్యాయం ఫై పిర్యాదు చెయ్యండి..మీము చూసుకుంటాం అని తేల్చి చేయడం తో సామాన్య ప్రజలు బయటకొస్తున్నారు. వారికీ జరిగిన అన్యాయం ఫై పిర్యాదు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో కోడెల జగన్ ప్రభుత్వం చాల ఇబ్బంది పెడుతుందని బాబు కు విన్నవిస్తే..నేను చూసుకుంటా అని బాబు చెప్పినట్లు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది . నిజం గా బాబు కోడెల కు అండగా ఉంటాడా అనేది ఇప్పుడు చర్చ గా మారింది. మాకు అన్యాయం జరిగింది..కోడెల కుటుంబ మమ్మల్ని అన్యాయం చేసిందని పిర్యాదులు చేస్తుంటే..వారికీ న్యాయం చేయాల్సింది పోయి కోడెల కు అండగా ఉంటానని బాబు చెప్పడం ఏంటి…? అంటే తమ ప్రభుత్వంలో కోడెల చేస్తున్న వాన్ని కూడా తెలిసే సైలెంట్ గా ఉన్నారా..ప్రజలను మోసం చేస్తుంటే చూస్తూ ఉరుకున్నారా..అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు .

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.