రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్తు ఏంటి..?

ఎనుముల రేవంత్ రెడ్డి.. గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి నాయకుడుగా ప్రాతినిద్యం వహిస్తున్నాడు.

2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి, ఆ తర్వాత రాజీనామా చేసి శాసనసభ ఉప ఎన్నికలలో గెలుపొందాడు. 2009లో కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించాడు. నాగం జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిన పిదప రేవంత్ రెడ్డి జిల్లాలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలోనే పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా పేరుపొందాడు.ఇతని దూకుడు స్వభావం వలన మీడియాలో ప్రముఖునిగా పేరు పొందాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరినా ఏకైక నాయకుడిగా నిలిచాడు. టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరడం , అక్కడికి నుండి వర్కింగ్ ప్రసిడెంట్ గా , తరవాత మొన్నటి ఎన్నికల కంపెనీస్ గా ఉన్నాడు. శాసన సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. తాజాగా రేవంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓటుకు నోట్ కేసులో భాగంగా ఈయన్ను విచారిస్తున్నారు. దీంతో మరోసారి ఈయన వార్తల్లో నిలిచేలా అయ్యింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్తు ఏంటి..? అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు.

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున మల్కజిగిరి లేదా ఖమ్మం నుండి గాని పోటీ చేయాలనీ చూస్తున్నాడట. కాంగ్రెస్ అధిష్టనము కూడా ఈ రెండు సీట్లలో ఏదో ఒకటి ఇచ్చేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ ఎన్నికల్లోనైనా రేవంత్ విజయం సాధిస్తాడా అనేది చూడాలి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.