ఇప్పట్లో షూటింగ్ లో జాయిన్ అయ్యే సమస్యే లేదట..

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా షూటింగ్ లు బంద్ అయ్యాయి. తాజాగా కేంద్రం షూటింగ్ లకు సడలింపులు ఇచ్చినప్పటికీ..ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడం తో షూటింగ్ లలో జాయిన్ అయ్యేందుకు నటి నటులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా షూటింగ్ లలో జాయిన్ అవ్వడం ఫై సంచలన నిర్ణయం తెలిపింది. తాను ఇప్ప‌ట్లో షూటింగ్స్‌లో పాల్గొన‌లేన‌ని ఖ‌రాఖండీగా చెబుతుంది.

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌కి క‌రోనా వ‌ల‌న తాత్కాలిక బ్రేక్ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ నుండి మూవీకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌పాలని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో అలియా భ‌ట్ ఇప్ప‌ట్లో షూటింగ్స్ లో పాల్గొన‌లేనని చెప్ప‌డంతో చిత్ర యూనిట్ కూడా ఆలోచ‌న‌లో ప‌డింది.