నిశ్శబ్దం వచ్చేది ఇక అప్పుడేనా ..

భాగమతి తర్వాత స్వీటీ అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో  ‘సైలెన్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరిట రిలీజ్ కాబోతుంది.  ఏప్రిల్ 2న ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల చేయాలనీ భావించారు కానీ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడం తో సినిమాను వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ (అమెజాన్ ప్రైమ్, జీ 5) లలో విడుదల అవుతుందని ఆ మధ్య ప్రచారం కాగా నిర్మాతలు దానిని కొట్టిపారేశారు. నేరుగా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిశ్శబ్దం సినిమా ఆగస్టులో అమెజాన్ ప్రయిమ్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ముందుగా అగ్రిమెంట్ కావాలి. ఆ తరవాత మెయిన్ స్ట్రీమ్ సినిమాకు పబ్లిసిటీ చేసిన రీతిగానే దీనికి కూడా ప్రచారం నిర్వహించే అవకాశం వుంది. అందుకోసం రెండు మూడు వారాల టైమ్ పడుతుంది.  కంటెంట్ విడుదల, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ మామూలుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రీ రిలీజ్ మీట్ హడావుడి లేకున్నా, కనీసం వర్చ్యువల్ ఫంక్షన్ లాంటిదన్నా చేయాలి. మొత్తం మీద ఒటిటి లోకి వచ్చే తొలి పెద్ద సినిమా ఇదే అవుతుంది.