హృతిక్ రోష‌న్‌తో గణితవేత్త ఆనంద్‌కుమార్ ఫుల్ ఖుషీ

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ ప్రముఖ గణితవేత్త ఆనంద్‌కుమార్ ను కలిశారు. ఆ సందర్భంగా ఆనంద్ కుమార్ హృతిక్ తో చాలా జాలీగా గడిపారు. ప‌ట్నాలో సూపర్‌ 30’ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా హృతిక్ రోష‌న్‌తో ప్రముఖ గణితవేత్త ఆనంద్‌కుమార్ చాలాసేపు గడిపారు. వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించిన సూపర్‌ 30’ చిత్రంలో ఆనంద్ కుమార్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా బిహార్‌లో సూపర్‌30 పేరుతో ఓ ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన ఆనంద్‌.. ఏటా 30 మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని ఉత్తీర్ణులు చేసేవారు. ఇప్పుడు సూపర్ 30 తన సినిమాను చూసిన ఆనంద్ ఎంతో మురిసిపోతూ హృతిక్ రోషన్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు.