HYD ట్రాఫిక్ పోలీసులు ఇది చూడండి – అనసూయ

రంగస్థలం లో రంగమ్మత్తగా యావత్ సినీ ప్రేక్షకులను అదరగొట్టిన యాంకర్ అనసూయ..తాజాగా తన ట్విట్టర్ లో నిర్లక్ష్యంగా కారు నడుపుతున్న ఓ వ్యక్తి వీడియోను ట్వీట్ చేస్తూ.. అతడిపై చర్య తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను కోరింది.

బుధవారం (జులై 18) సాయంత్రం అనసూయ తన కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లో వెళ్తుండగా.. అదే దారిలో ఓ వ్యక్తి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ కారు డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలను తన ఫోన్ లో వీడియో తీసి, ఆ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేస్తూ నగర ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసింది.

‘డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులూ.. ఇతరుల తప్పిదంతో నేను ఇదివరకే ఒకసారి ప్రమాదం బారిన పడ్డా. దయచేసి ఇలాంటి నిర్లక్ష్యపు చోదకులను వదిలేయకండి. రోడ్లపై తమకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించే ఇలాంటి వారికి ఇతరుల ప్రాణాలంటే లెక్క లేదా?’ అని అనసూయ ట్వీట్ చేసింది.