‘అరవింద’ టీజర్ టాక్ – అరాచకంగా ఉంది..

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్భాంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ ను ఎప్పుడెప్పుడు చూద్దామాని నందమూరి అభిమానులతో పాటు త్రివిక్రమ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. వారి ఎదురుచూపులు తగ్గట్లు టీజర్ అరాచకంగా ఉంది.

మరోసారి త్రివిక్రమ్ తన మాటలకూ పదును పెట్టాడు..యాక్షన్ తో కూడిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కి తగ్గట్లే పవర్ ఫుల్ డైలాగ్స్ రాసుకున్నాడని ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. జగపతి చెప్పే డైలాగ్స్ కు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ కంట పడ్డావా..కనికరిస్తానేమో, వెంట పడ్డానా నరికేస్తానేమొబా…అనేవి వింటుంటే రోమాలు నిక్క పొడుచుకోవలసిందే..ఇక థమన్ మరోసారి అదరగొట్టబోతున్నాడని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే అర్ధం అవుతుంది. ఈ ఒక్క టీజర్ చాలు అరవింద ఎలా ఉండబోతుందో చెప్పడానికి..

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ లో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తుండగా , సునీల్ ఓ ముఖ్య రోల్ లో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్లో నడిచే కథగా ఉండనుంది.