అరవింద సమేత ట్రైలర్ టాక్ – ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో లో రాబోతున్న చిత్రం అరవింద సమేత. పూజా హగ్దే , ఇషా రెబ్భా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ఆడియో కు సైతం మంచి రెస్పాన్స్ రావడం తో ఇంకాస్త అంచనాలు పెరిగాయి.

ఇక సినిమాకు సంబందించిన అసలు సిసలైన ట్రైలర్ ను ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేసారు..ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పడానికి మాటలు లేవు..ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమా తో మరోసారి చూడబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

మీ పేరు..పేరు ఒక్కటే చాలా లేక అడ్రెస్ అంత కావాలా..అంటూ ట్రైలర్ మొదలై చాలా క్యూట్ గా స్టార్ట్ ఆయె ఆ తర్వాత అసలు సిసలైన యాక్షన్ మొదలు అయ్యింది. మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్‌ రాయలసీమ పౌరుషం చూపించారు. ‘30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ అని ఎన్టీఆర్‌తో ఆయన బామ్మ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ‘సర్‌ వంద అడుగుల్లో నీరు పడుతుంది అంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సర్‌. తవ్వి చూడండి’ అంటూ ఎన్టీఆర్‌ చివర్లో భావోద్వేగంతో చెప్పే డైలాగ్ వింటుంటే అబ్బా అనకుండా ఉండాల్సిందే.

ఈ ఒక్క ట్రైలర్ చాలు సినిమా ఏ స్థాయి లో ఉండబోతుందో..త్రివిక్రమ్ తన కసిని ఎలా చూపించాడో..రాధాకృష్ణ నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. ఎన్టీఆర్ లోని మాస్ అప్పీల్ ను చూపిస్తూనే.. త్రివిక్రమ్ తనలోని దర్శకుడిని, డైలాగ్ రైటర్ ను బయటపెట్టే ప్రయత్నం చేశాడు. థమన్ ట్రైలర్ లో మెరుపులు మెరిపించారు. టీజర్ ఎలాగైతే మాస్ ను ఆకట్టుకుందో ఈ ట్రైలర్ కూడా మాస్ తో అటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.