మరో సీనియర్ హీరోకు మణి మ్యూజిక్..

మెలోడీ బ్రహ్మ గా మణిశర్మ కు ఎంతో పేరుంది. టాలీవుడ్ సీనియర్ , యంగ్ హీరోలంతో పనిచేసాడు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో మ్యూజికల్ హిట్ అందుకొని మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మణికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. అవికూడా సీనియర్ హీరోల చిత్రాలు కావడం విశేషం. రీసెంట్ గా చిరు – కొరటాల కలయిల్లలో తెరకెక్కబోయే చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మణిని ఎంపిక చేయగా..వెంకీ చేయబోయే అసురన్ రీమేక్ కు మణినే ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళంలో ధనుష్ నటించిన అసురన్ మూవీ తెలుగులో వెంకటేష్ చేయబోతున్న సంగతి తెలిసిందే. డీగ్లామర్ రోల్ లో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో సహజ నటనతో కట్టిపడేయడం తో ఈ సినిమాను రీమేక్ చేయాలనీ వెంకీ ఫిక్స్ అయ్యాడు. తెలుగు నెగిటివిటీ కి తగ్గట్లు తెరకెక్కించాలని భావించారు.

ఈ రీమేక్ ను సురేష్ బాబు మరియు కళైపులి ఎస్ థాను గారు కలిసి నిర్మించబోతున్నట్లుగా కూడా ప్రకటన వచ్చింది. ఈ రీమేక్ బాధ్యత శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మ్యూజిక్ కూడా మణిశర్మ చేతిలో పెట్టినట్లు తెలుస్తుంది.