బాలయ్య కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్…

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్ టి ఆర్’ చిత్రం లో నటిస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రచారం చిత్రాలు సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి.

ఇదిలా ఉంటె బాలకృష్ణ కోసం బోయపాటి శ్రీను ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయిస్తున్నాడట. ప్రముఖ రైటర్ ఎం. రత్నం చేత ఓ కథ చేయిస్తున్నాడట. పొలిటికల్ నేపథ్యంలో ఈ కథ రాబోతుందని ప్రచారం జరగడం తో చిత్ర కథలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాడట బోయపాటి. ప్రధానంగా రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి, ఎండగట్టే విధంగా మంచి పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ ఉంటుందట.

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బాలయ్యకు ఆయన పొలిటికల్ కెరీర్ కు సహాయపడే విధంగా ఈ సినిమాను రూపొందించాలని బోయపాటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే బోయపాటి – బాలకృష్ణ కాంబో లో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కావడం తో మూడోసారి రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.