పునర్నవి ఎవర్ని పెళ్లి చేసుకోబోతుంది..?

ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన పునర్నవి..ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ 3 అమ్మడి జతకన్నే మార్చేసింది. ఈ షో అమ్మడిని టాప్ సెలబ్రిటిని చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను , అభిమానులను అలరిస్తూ వస్తున్న ఈ భామ..అభిమానులకు , నెటిజన్లకు షాక్ ఇచ్చింది. తనకు పెళ్లి ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. “ఫైనల్లీ ఇట్స్‌ హ్యాపెనింగ్‌” అంటూ తనకు ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయాన్ని ప్రకటించింది.

ఈ ఫొటోలోనే ఆమె చేయిని మరో చేయి పట్టుకుని ఉంది. ఆ చేయి ఎవరదనేది మాత్రం పునర్నవి చెప్పలేదు. నిజానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో లవ్‌ట్రాక్‌ నడిచింది. ప్రేక్షకులంతా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని అనుకున్నారు. పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరికీ ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు. ఏదైతేనేం పునర్నవి త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. అదెవరితో అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.