ఐసీసీ రూల్స్ పై బాలీవుడ్ సెటైర్లు…!


వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఐసీసీ రూల్స్ ఇప్పుడు తెగ సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్‌’ ను పాటించడంపై బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఐసీసీకి పంచ్‌ విసిరారు. తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఐసీసీ అవలంభించిన విధానాన్ని కడిగిపారేశారు. ‘నీ వద్ద రెండు వేల రూపాయిలు ఉన్నాయనుకుందాం. నా వద్ద రెండు వేల రూపాయిలు నోటు ఒకటే ఉంటే, అప్పుడు నీ దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉన్నాయి. అప్పుడు ఎవరు సంపన్నులు అవుతారు ఐసీసీ. మీ లెక్కన నాలుగు ఐదు వందల నోట్లు ఉన్న వాడే సంపన్నుడు అవుతాడా? అంటూ సెటైర్లు వేశారు.


ఐసీసీ రూల్స్‌పై బాలీవుడ్‌ విలక్షణ నటుడు పరేష్‌ రావల్‌ సైతం ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. ‘ఎంఎస్‌ ధోని గ్లౌవ్స్‌ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్‌ ఓవర్‌ రూల్స్‌ మార్చుకుంటే బాగుంటుంది’ అని చురకలంటించారు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ అత్యధిక బౌండరీల ఆధారంగా చాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ రెండు టై కావడంతో విజేతను తేల్చేందుకు బౌండరీ రూల్‌ను అవలంభించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.