వర్మ టీం లో కరోనా కలకలం ..?

కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏమాత్రం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ లాభాలు అనుకుంటున్నాడు. క్లయిమాక్స్ , నగ్నం చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా 12 క్లాక్‌ అంటూ హారర్‌ సినిమాతో భయపెట్టబోతున్నాడు. అయితే అత‌ని టీంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ వేశారనే వార్తలు వైరల్ అయ్యాయి..

ఈ వార్తల ఫై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన ఆర్జీవి.. మా బృందంలో ఒకరికి పాజిటివ్ వ‌చ్చింద‌ని, దాని వ‌ల‌న మేము షూటింగ్ పనిని ఆపివేసినట్లు వార్తలు వ‌స్తున్నాయి.. వాస్తవానికి షూట్ ప్రారంభమయ్యే ముందు ప్ర‌తి ఒక్క‌రం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాం. అంద‌రికి నెగెటివ్ అని తేలింది. అంతేకాదు ప్ర‌భుత్వం సూచించిన‌ అన్ని మార్గదర్శకాలను కఠినంగా పాటిస్తున్నాము అని క్లారిటీ ఇచ్చారు.