‘ఎఫ్ 2 ‘ 33 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్ 2 . ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వస్తుంది. సినిమా విడుదలై నెల రోజులు దాటుతున్న ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాబట్టడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఇక ఈ చిత్రం 33 రోజుల్లో దాదాపుగా 80 కోట్ల షేర్ ను దక్కించుకున్నట్లు సమాచారం. 50 రోజులు పూర్తి అయేలోపు రూ. 100 కోట్లు షేర్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు చెపుతున్నారు.

ఏరియాల వారిగా 33 రోజుల కలెక్షన్స్ చూస్తే..

ఏరియా కలక్షన్స్
నైజాం 22.5 కోట్లు
సీడెడ్ 8.51 కోట్లు
ఉత్తరాంధ్ర 10.2 కోట్లు
తూర్పు గోదావరి 6.7 కోట్లు
పశ్చిమ గోదావరి 4.1 కోట్లు
కృష్ణ 5.1 కోట్లు
గుంటూరు 5.5 కోట్లు
నెల్లూరు 1.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు
ఓవర్సీస్ 9.25 కోట్లు
టోటల్ 79.31 కోట్లు