సినీ ప్రేమికులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటిలేదు..

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్ తెలిపింది మహారాష్ట్ర ప్రభుత్వం..ఇటీవల కాలంలో మల్టీప్లెక్స్‌ థియేటర్స్ ఎక్కువై పోయాయి..అందులో టికెట్ ధర కంటే విశ్రాంతి సమయంలో ఏమైనా తిందామంటే మాత్రం టికెట్ ధర కంటే రెండింతలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సినిమాకు ఫ్యామిలితో వెళ్ళాలంటే…. కనీసం మూడు నాల్గు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పోనీ బయటి నుంచి తీసుకెళదామా అంటే దానికి అనుమతించరు. దీంతో సామాన్య మానవుడు సినిమాలకు వెళ్లడమే మానేసాడు.

దానిపై ఉన్న రేటుకే అమ్మాలని కోర్ట్ చెపుతున్న థియేటర్స్ యాజమాన్యం మాత్రం వాటిని పట్టించుకోరు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఆంక్షలు లేవని క్లారిటీ ఇస్తోంది. బయటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలను అనుమతించాల్సిందేనని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రవీంద్ర చవన్‌ స్పష్టం చేశారు. మల్టిప్లెక్స్‌లోకి బయటి నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్ళి… తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా బయటి నుంచి తెచ్చిన ఆహార పదార్థాలను నిషేధిస్తే తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల మహారాష్ట్ర సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే బాగుండని అనుకుంటున్నారు.