హైపర్ ఆది తో త్రివిక్రమ్ మాటలు..?

జబర్దస్త్ షో తో ఎంతో పాపులర్ అయ్యాడు హైపర్ ఆది..హైపర్ ఆది స్కిట్ అంటే నవ్వుకొని చావాల్సిందే..ఆయన వేసే ప్రతి పంచ్ సూపర్ గా పేలుతుంది. అందుకే ఆది కి సినిమా అవకాశాలు కూడా నిండుగా వస్తాయి. ఇక ఆయన పాత్రకు ఆయనే డైలాగ్స్ రాసుకుంటాడు. తాజాగా త్రివిక్రమ్ ..హైపర్ ఆది తో మాటలు రాయించుకుంటున్నట్లు వార్తలు ప్రచారం కావడం తో అందరు ఇదే నిజమేనా అని ఆది ని అడగడం మొదలు పెట్టారట. దీంతో దానిపై ఆది క్లారిటీ ఇచ్చాడు.

సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలన్నీ పుకార్లే అంటూ కొట్టి పారేశాడు. త్రివిక్రమ్ గారిపై తనకు చాలా అభిమానం ఉంది ఆ అభిమానంతో ఆయన్ను మూడు సార్లు కలవడం జరిగింది. అభిమానంతోనే కలిశాను తప్ప అంతకు మించి మరేం లేదు. ఆయన సినిమాలకు మాటలు రాసేంతటి వ్యక్తిని నేను కాదు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ గారు ఆయన తీసే సినిమాలకు కథ – మాటలు సొంతంగా రాసుకుంటారు. ఆయనకు మరెవ్వరి అవసరం లేదని ఆది చెప్పుకొచ్చాడు.