ఇల్లి దెబ్బకు అన్ని అమ్ముడుపోయాయి..

ఇలియానా..ఈ పేరు మళ్లీ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు ఈ పేరును అంత మరచిపోయారు . కానీ ఇప్పుడు శ్రీను వైట్ల – రవితేజ ల పుణ్యమాని మళ్లీ ఈమె పేరు అందరి నోటా వినిపిస్తుంది. దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈ గోవా బ్యూటీ , మొదటి సినిమాతోనే అందర్నీ తన వైపు తిప్పుకుంది. రెండో సినిమా ఏకంగా మహేష్ సరసన నటించే ఛాన్స్ దక్కడం తో అమ్మడి రేంజ్ ఓ రేంజ్ కు వెళ్ళిపోయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తో అగ్ర హీరోలు ఈమెకోసం పరుగులు పెట్టారు. ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ ,రవితేజ లతో వరుస హిట్లు సాధించిన ఈ భామ అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఫై మోజుతో టాలీవుడ్ కు బై బై..చెప్పింది..ఆలా వెళ్లిన ఇల్లి , ఇంతకాలానికి మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది.

ఇక ఆ సంగతి పక్కన పెడితే..తాజాగా ఈ అమ్మడు రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాప్ కువ వెళ్లి కూరగాయలు కొనడం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. జిమ్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో రోడ్డు పక్కన తాజా వంకాయలు కనిపించాయట. అంతే వెంటనే కారుదిగేసి.. రోడ్డు పక్కనే ఉన్న కూరగాయల షాప్ కు వెళ్లి వంకాయలను ఏరుకొని.. ఒక సాధారణ మహిళలాగే బేరం చేసి కూరగాయలు కొనుక్కొని కారెక్కకి వెళ్ళిపోయింది. ఇల్లిని చూసిన ఆ చుట్టుపక్కల వారంతా షాప్ చుట్టూ చేరారు. ఇలియానా కొన్నది కాబట్టి తమకు అవసరం ఉన్నా లేకున్నా.. ఆ షాప్ లోని కొరగాయాలన్నింటిని కొనేశారట. దీంతో సదరు వ్యాపారి ఫుల్ గా సంతోషం వ్యక్తం చేసాడట.