జగపతి ముందు అజిత్ పనికిరాకుండా పోయాడు..

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న జగపతి బాబు..ప్రస్తుతం విలన్ గా మారి వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ టాప్ విలన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలా అన్ని భాషలను కవర్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. తాజాగా జగపతి, అజిత్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వాసం మూవీలో విలన్ గా నటిస్తున్నాడు.

ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ చూసిన వారంత జగపతి లుక్ ముందు అజిత్ లుక్ చాల దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. జగపతిబాబు అత్యంత స్టైలిష్ గా ట్రెండీ విలన్ గా కనిపించబోతున్నాడు. ఏ పాత్ర పోషించినా అందులో ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు లుక్ పరంగా కూడా వావ్ అనిపించేలా జగపతిబాబు ఉన్నాడంటూ అంత మాట్లాడుకుంటున్నారు.