మరో సినిమాపై కబీర్ కన్ను..

ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలను రీమేక్ చేయడంలో తెలుగు దర్శకులు , హీరోలు ఎక్కువ ఇంట్రస్ట్ చూపించే వారు..కానీ ఇపుడు రివర్స్ అయ్యింది. మన తెలుగు చిత్రాలపైనే వారు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఏదైనా పెద్ద సినిమా వస్తే చాలు దానిని ముందుగా చూసి నచ్చితే వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలను రీమేక్ చేసి విజయాలు సాధించగా..తాజాగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీ లో కబీర్ సింగ్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు షాయిద్.

ఈ సినిమా ఓపెనింగ్స్ ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచాయి. ఈ చిత్రం థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతుండగా..తాజాగా ఈయన కన్ను మరో తెలుగు సినిమాపై పడినట్లు తెలుస్తుంది. గౌతమ్ – నాని కాంబినేషన్లో వచ్చిన జెర్సీ చిత్ర రీమేక్ లో నటించాలని షాయిద్ భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్ హక్కులను కరణ్ జోహార్ కొన్నట్టు సమాచారం. ఈ రీమేక్ వెర్షన్ ను డైరెక్ట్ చేసే అవకాశం తెలుగు వెర్షన్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికే దక్కిందట. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారో..షాయిద్ కు మళ్లీ హిట్ కొడతాడో చూడాలి .