ప్రభాస్‌పై కాజల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ముద్దుగుమ్మ కాజల్‌ తాజాగా ఓ ఇంటర్య్వూలో ముచ్చటించింది. అందులో భాగంగా యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌పై పలు వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌ గురించి అడిగిన ప్రశ్నలకు ‘ఐరన్‌మ్యాన్‌, హల్క్‌’ల కాంభినేషన్‌ అంటూ వింత కాంప్లిమెంట్‌ ఇచ్చింది. హాలీవుడ్‌ ప్రముఖ క్యారెక్టర్స్‌తో ప్రభాస్‌ను పోల్చడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అంతేకాకుండా కాజల్‌ వ్యాఖ్యల క్లిప్పింగ్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు.

‘సైరా’ ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ కూడా కాజల్‌పై పాజిటివ్‌గా స్పందించారు. ఆమెతో వర్క్‌ చాలా కంఫర్ట్‌ అన్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. దాంతో ఇద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది. ఈ కాంబోలో హ్యాట్రిక్‌ చిత్రం వస్తే బావుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు. అయితే ఈ ఆశలు నెరవేరుతాయా? చూడాలి.