కాజల్.. లేవగానే భర్తతో ఆ పని కానిస్తుందట…

కోరుకున్నవ్యక్తి తో కాజల్ ఏడు అడుగులు వేసింది. అక్టోబర్ 30 న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఆమె వివాహం జరిగింది. కుటుంబసభ్యులు సన్నిహితుల సమక్షంలో మార్వాడీ సంప్రదాయ పద్దతిలో ఈ కాజల్ వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఇక పెళ్లి తర్వాత వరుసగా గౌతమ్ తో ఫోటో షూట్స్ చేస్తూ..వాటిని అభిమానులకు షేర్ చేస్తూ కాజల్ హడావిడి చేస్తూ వస్తుంది. ఈ సంద‌ర్భంగా ఆమె అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు.

పెళ్లి త‌ర్వాత బాధ్య‌త‌లు పెరిగాయ‌ని చెప్పుకొచ్చారు. మ‌రీ ముఖ్యంగా త‌న జీవితంలో భ‌ర్తే స‌ర్వ‌స్వం అయ్యార‌ని చెప్ప‌డం విశేషం. మాల్దీవుల్లో హ‌నీమూన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసిన‌ట్టు కాజ‌ల్ త‌న సంతోషాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

సినిమాల‌కు ఎప్ప‌టికీ దూరం కాన‌ని తేల్చి చెప్పారు. ఎందుకంటే త‌న ఫ‌స్ట్ ల‌వ్ సినిమానే అని చెప్ప‌డం విశేషం. కెమెరా ముందు నిలిస్తే ధ్యానంలో ఉన్నాన‌నే ఫీలింగ్‌కు గురి అవుతాన‌న్నారు. రోజువారి దినచర్యను గౌతమ్ ప్రేమ‌గా అందించే కౌగిలింతతో స్టార్ట్ చేస్తాన‌ని కాజ‌ల్ చెప్ప‌డం విశేషం. గౌత‌మ్‌తో కౌగిలింత త‌ర్వాతే మిగిలిన కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడ‌తా న‌న్నారు.