బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కాంచన 3 ..

కాంచన సిరీస్ లో వచ్చిన మూడో భాగం కాంచన 3 ..తమిళనాటే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమ్ముదులుపుతుంది. ఏప్రిల్ 19 న నాని నటించిన జెర్సీ చిత్రానికి పోటీగా వచ్చిన కాంచన 3 ..బి , సి సెంటర్లలో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ బయ్యర్లకు భారీ లాభాల దిశకు తీసుకెళ్తుంది.

హర్రర్ కంటెంట్ తో పాటు మంచి కామెడీని కూడా ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు. మాస్ ప్రేక్షకులు విపరీతగా చూస్తున్నారు. సింగిల్ స్క్రీన్లలో ఆక్యుపెన్సీ బాగానే ఉంది. మొదటి మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 9.13 కోట్ల షేర్ రాబట్టుకుంది. ఇక తమిళనాట కూడా భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ..టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.