సుశాంత్-సారా ప్రేమాయణం ఫై కంగనా ఘాటైన వ్యాఖ్యలు..

సుశాంత్ ఆత్మ హత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లో పలు వ్యవహారాలు బయటపడుతూ సంచలనం రేపుతున్నాయి. నేపోటిజం అనే పదం కొన్ని రోజులుగా వైరల్ కాగా…ఆ తర్వాత డ్రగ్స్ వ్యవహారం బయటకొచ్చి సంచలనం గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తుంటే..తాజాగా కంగనా సుశాంత్-సారా అఫైర్ గురించి ట్విట్టర్ లో స్పందించింది.

సైఫ్ అలీఖాన్ కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌తో సుశాంత్ ప్రేమాయణం సాగించాడనే విషయం రీసెంట్ గా బయటకొచ్చింది. సారాను సుశాంత్ ఓ ప్రైవేట్ జెట్‌లో బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడని, అక్కడ వారిద్దరూ మూడు రోజులు ఎంజాయ్ చేశారని సుశాంత్ సన్నిహితులు వెల్లడించారు. ఈ అఫైర్ ఫై కంగన స్పందించింది. సుశాంత్-సారా అఫైర్ గురించి మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. బ్యాంకాక్‌లో వారిద్దరూ ఒక రూమ్‌ను పంచుకున్నారు. సుశాంత్‌లో ఆమె ఎన్నో ఆశలు రేకెత్తించింది. స్టార్ వారసురాలైన సారా బయటి నుంచి వచ్చి కష్టపడుతున్నవాళ్లకు ఇలాంటి ఆశలు చూపించడం ఎందుకు? తర్వాత వారిని పబ్లిక్‌గా ముంచడం ఎందుకు అని కంగన ప్రశ్నించింది.