కత్రినా ప్రపోజ్ చేస్తే సల్మాన్ ఏమన్నాడో తెలుసా..?

సల్మాన్ ఖాన్..కత్రినా కైఫ్ రియల్ లైఫ్ లో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే..ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని అంత ఊహించారు కానీ ఇద్దరి మధ్య తేడా రావడం తో కొంతకాలం దూరమైయ్యారు. మళ్లీ ఈ మధ్యనే కలిసి సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి భారత్ అనే సినిమా చేస్తున్నారు.

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన ఓ వీడియో ప్రోమో యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో చాల ఆకట్టుకునేలా ఉంది. కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ కు ప్రపోజల్ చేస్తుంది. పెళ్లి వయసు వచ్చింది ఇంకెప్పుడు చేసుకుంటావు అని కత్రినా అడిగితె అవును అని సల్మాన్ సమాధానం ఇస్తాడు. నువ్వు చూడటానికి చాలా బాగుంటావు అని అంటే… ధన్యవాదాలు అని జవాబిస్తాడు. నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితె.. సల్మాన్ చెప్పిన సమాధానం విచిత్రంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో 20 సంవత్సరాల వయసు నుంచి 70 ఏళ్ల వయసువరకు సల్మాన్ ఖాన్ వివిధ రకాల గెటప్స్ లో కనిపించి అలరిస్తారని తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా జూన్ 5 వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.